Congress Win : తెలంగాణ – రాష్ట్రంలో ప్రస్తుతం జరగబోయే శాసన సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోందంటూ లోక్ పోల్ మెగా సర్వే వెల్లడించింది. బుధవారం ట్విట్టర్ వేదికగా సర్వే సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు అధికారంలో కొనసాగుతున్న భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రభుత్వం కూలి పోవడం ఖాయమని పేర్కొంది.
Congress Win Announced by Lokpoll Survey
ఓటు శాతంగా చూస్తే 38 శాతం నుంచి 41 శాతం ఓటు షేర్ తో బీఆర్ఎస్ కు 119 సీట్లకు గాను 36 నుంచి 39 సీట్లు కైవసం చేసుకుంటుందని వెల్లడించింది. ఇక ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ(Congress) ఊహించని రీతిలో ఓటు శాతం పెరిగిందని తెలిపింది. 43 నుంచి 46 శాతం తో ఏకంగా 69 నుంచి 72 సీట్లు కైవసం చేసుకుంటుందని పేర్కొంది.
రాష్ట్రంలో భారీ ఎత్తున ప్రభుత్వ వ్యతిరేకత నెలకొందని అంతే కాకుండా దౌర్జన్యం, దోపిడీ, మోసం ప్రధానంగా మైనస్ కానుందని తెలిపింది. ఇక అసదుద్దీన్ ఓవైసీ ఆధ్వర్యంలోని ఎంఐఎం 5 నుంచి 6 సీట్లు గెలుచుకునే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. ఇక బీజేపీ 2 నుంచి 3 సీట్లు వస్తాయని , అయితే చాలా చోట్ల ఆయా పార్టీల అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేయనుందని పేర్కొంది.
Also Read : RS Praveen Kumar : బర్రెలక్కపై దాడి దారుణం