Bilkis Bano : బిల్కిస్ బానో రివ్యూ పిటీషన్ పై పరిశీలన
దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఖైదీల రిలీజ్
Bilkis Bano : బిల్కిస్ బానో గురించి పరిచయం చేయాల్సిన పని లేదు. ఆమె అత్యాచారానికి గురైన బాధితురాలు. 2002లో జరిగిన ఘోరమైన ఘటనలో బిల్కిస్ బానో సర్వం కోల్పోయింది. విచిత్రం ఏమిటంటే తనపై అత్యాచారానికి పాల్పడిన వాళ్లను కేంద్రం సహకారంతో గుజరాత్ బీజేపీ ప్రభుత్వం విడుదల చేయడం. దీనిని సవాల్ చేసింది ఆమె.
ఈ మేరకు వారి నుంచి తనకు భద్రత ఉండదని, జీవిత ఖైదు విధించబడిన ఆ 11 మందిని తిరిగి జైలుకు పంపించాలని కోరుతూ రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఆమెకు న్యాయం జరగాలని కోరుతూ పెద్ద ఎత్తున దేశ వ్యాప్తంగా డిమాండ్ పెరిగింది. పెద్ద ఎత్తున మహిళలు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ కూడా రాశారు.
ఇదిలా ఉండగా బిల్కిస్ బానో(Bilkis Bano) వేసిన రివ్యూ పిటిషన్ కు సంబంధించి ముందస్తు జాబితాను సుప్రీంకోర్టు పరిశీలించనుంది. అయితే ఇంకా జాబితా చేయక పోవడాన్ని సీజేవై ధనంజయ వై చంద్రచూడ్ , న్యాయమూర్తులు పీఎస్ నరసింహ, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం దృష్టికి తీసుకు వెళ్లింది.
దీంతో బిల్కిస్ బానో కేసుకు సంబంధించి డిసెంబర్ 13న విచారణకు లిస్టు చేసింది. దోషులకు సంబంధించిన ఉపశమన పిటిషన్ ను పరిశీలించాలని గుజరాత్ ప్రభుత్వానికి సూచించింది ధర్మాసనం. గతంలో ఇచ్చిన ఉత్తర్వులను సమీక్షించాలని కోరుతూ దాఖలైన సర్క్యులేషన్ వారీగా జాబితాను త్వరగా పరిశీలిస్తామని సుప్రీంకోర్టు సోమవారం వెల్లడించింది.
అయితే రివ్యూ పిటిషన్ ను ఇంకా జాబితా చేయలేదంటూ న్యాయవాది శోభా గుప్తా తెలియ సమర్పించిన సమర్పణలను ధర్మాసనం పరిగణలోకి తీసుకుంది.
Also Read : సీఎంగా కొలువు తీరిన భూపేంద్ర పటేల్