Railways Over Bridges : భారీ ఎత్తున ఓవ‌ర్ బ్రిడ్జీల నిర్మాణం

1,000కి ప్లాన్ చేసిన రైల్వే శాఖ

Railways Over Bridges : కేంద్ర రైల్వే శాఖ కీలక ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ప్ర‌మాదాలు నివారించేందుకు గాను 1,000 ఓవ‌ర్ బ్రిడ్జిలు ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ బ్రిడ్జి(వంతెన‌)లతో పాటు అండ‌ర్ పాస్ ల‌ను అంత‌ర్జాతీయ భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌కు అనుగుణంగా నిర్మిస్తామ‌ని డీఎఫ్‌సీ ఉన్న‌తాధికారి వెల్ల‌డించారు.

దేశ వ్యాప్తంగా రైల్వే క్రాసింగ్ ల వ‌ద్ద ప్ర‌మాదాల‌ను నివారించేందుకు వీటిని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు తెలిపారు. దాదాపు రైల్వే ప్ర‌మాదాలు బ్రిడ్జీలు, అండ‌ర్ పాస్ లు లేక పోవ‌డం వ‌ల్ల 40 శాతంకు పైగా ప్ర‌మాదాలు జ‌రుగుతున్న‌ట్లు విచార‌ణ‌లో వెల్ల‌డైంది. నిర్దేశించిన ప్రాజెక్టులో మొత్తం వెయ్యికి పైగా నిర్మించాల‌ని నిర్ణ‌యించారు.

వీటిలో మొద‌టగా 700 అండ‌ర్ పాస్ లు, 300 ఓవ‌ర్ బ్రిడ్జిల‌ను(Railways Over Bridges)  నిర్మించేందుకు నిర్ణ‌యించారు. వీటిలో ఇప్ప‌టికే 550 అండ‌ర్ పాస్ లు నిర్మించ‌డం జ‌రిగింద‌ని డీఎఫ్సీ మేనేజింగ్ డైరెక్ట‌ర్ ఆర్ కె జైన్ స్పష్టం చేశారు. ఇప్ప‌టికే డీఎఫ్‌సీ 46 క్రాసింగ్ ల‌ను గుర్తించింద‌ని, త్వ‌ర‌లో ఫ్లై ఓవ‌ర్ ల నిర్మాణాన్ని ప్రారంభిస్తామ‌ని తెలిపారు.

ఫ్లై ఓవ‌ర్ లు , అండ‌ర్ పాస్ లు నిర్మిస్తే గూడ్స్ రైళ్లు గంట‌కు 100 కిలోమీట‌ర్ల వేగంతో న‌డ‌ప‌గ‌ల‌వ‌ని పేర్కొన్నారు. పంజాబ్ లోని లూథియానా , ప‌శ్చిమ బెంగాల్ లోని దంకుని నుండి తూర్పు కారిడార్ పొడ‌వు 1,875 కిలోమీట‌ర్లు. యూపీలో ని దాద్రీ నుండి ముంబై స‌మీపంలోని జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్ర‌స్ట్ దాకా ప‌శ్చిమ కారిడార్ 1,506 కిలోమీట‌ర్ల మేర ఉంది.

దేశంలోని రైలు నెట్ వ‌ర్క్ లో 70 శాతం ర‌ద్దీ త‌గ్గుతుంద‌ని జైన్ ప్ర‌క‌టించారు.

Also Read : న్యూజిలాండ్ తో బంధం బ‌లోపేతం – జై శంక‌ర్

Leave A Reply

Your Email Id will not be published!