Ram Madhav : రామ్ మాధవ్ లంక టూర్ పై వివాదం
ఏ హోదాపై వెళ్లారంటూ ఆగ్రహం
Ram Madhav : ఎవరీ రామ్ మాధవ్ అనుకుంటున్నారా. భారతీయ జనతా పార్టీలో కీలక నాయకుడు. పార్టీ తరపున ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దుతారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే ఆయనపై గవర్నర్ సత్యపాల్ మాలిక్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
దానిపై రామ్ మాధవ్ స్పందించ లేదు. అప్పట్లో తీవ్ర వివాదం నెలకొంది. ఈ తరుణంలో రామ్ మాధవ్ శ్రీలంక ప్రధానిని కలిశారు. దీనిపై ప్రతిపక్షాలు, పలు సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
ఎలాంటి ఆధారాలు లేకుండా కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, అగ్ర నేత రాహుల్ గాంధీకి ఈడీ నోటీసలుఉ పంపించిందని మరి గౌతమ్ అదానీకి ఎందుకు నోటీసులు ఇవ్వలేదని కాంగ్రెస్ నాయకుడు ప్రశ్నించారు.
శ్రీలంకలోని మన్నార్ పవన విద్యుత్ ప్రాజెక్టును అదానీ గ్రూప్ కు ఇవ్వాలంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒత్తిడి చేశారంటూ సిలోన్ ఎలక్ట్రిసిటీ బోర్డు మాజీ చైర్మన్ ఫెర్డినాండో ఆరోపించారు.
ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేగింది. ఇదిలా ఉండగా ఏ హోదాతో రామ్ మాధవ్(Ram Madhav) అక్కడికి వెళ్లారో కేంద్ర సర్కార్ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా రామ్ మాధవ్ లంకలో ఉండగానే శ్రీలంకలో స్టాప్ అదానీ అంటూ పెద్ద ఎత్తున ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఈ తరుణంలో రామ్ మాధవ్(Ram Madhav) పై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి.
ప్రస్తుత ప్రభుత్వంలో ఎలాంటి అధికారిక పదవి లేదు. పీఎం రణిల్ విక్రమసింఘె తో భేటీ కావడం చర్చకు దారి తీసింది. రామ్ మాధవ్ ప్రభుత్వం వైపు వెళ్లారా లేక అదానీ వైపు నుంచి వెళ్లారా అన్నది తేల్చాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
Also Read : రేణుకా చౌదరిపై కేసు నమోదు