LPG Cylinder Hike : ఓ వైపు పెట్రోల్, డీజిల్ మంట మండుతోంది. ఇంకో వైపు నిత్యావసర సరుకుల ధరలు కోలుకోలేని షాక్ ఇస్తున్నాయి. ఇప్పటికే కమర్షియల్ గ్యాస్ ధర (LPG Cylinder Hike)పెంచిన చమురు కంపెనీలు తాజాగా వంట గ్యాస్ వినియోగదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది.
ఎల్పీజీ 14.2 కిలోల సబ్సిడీ లేని వంట గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీలో రూ. 999.50కి పెరిగింది. దేశీయ వంట గ్యాస్ ధరను సిలిండర్ కు రూ. 50 చొప్పున శనివారం పెంచాయి చమురు కంపెనీలు. రెండు నెలల్లో దాని ధరలు (LPG Cylinder Hike)పెరగడం ఇది రెండవసారి.
ఇదిలా ఉండగా మే నెల ప్రారంభంలో వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల ధరను రూ. 102.50కి పెంచింది. కొన్ని రోజుల తర్వాత దేశీయ వంట గ్యాస్ ధరను సిలిండర్ కు రూ. 50కి పెంచాయి.
దీంతో 14.2 కిలోల నాన్ సబ్సిడీ వంట సిలిండర్ ధర ఇప్పుడు రూ. 999.50 కి పెరిగింది. గ్యాస్ ధరల ప్రభావం ప్రధానంగా పేదలు, మధ్య తరగతి వినియోగారులపై పడనుంది.
కేంద్ర ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహరిస్తోందని ఆయిల్, గ్యాస్ వినియోగదారులు. ప్రస్తుతం ప్రభుత్వం ఉక్రెయిన్, రష్యా యుద్దం కారణంగానే ధరలు పెంచాల్సి వస్తోందని అంటోంది.
ఇతర దేశాలలో కంటే ఇండియాలోనే ధరా భారం ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇదిలా ఉండగా చర్యలు తీసుకోవాల్సిన ప్రధాన మంత్రి ఈ నెపాన్ని ఆయా రాష్ట్రాలపైకి నెట్టేస్తుండడం విస్తు పోయేలా చేస్తోందంటూ కాంగ్రెస్ అగ్ర నాయకుడు , వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Also Read : ఇస్లామిక్ టెర్రరిజానికి కేరళ కేరాఫ్