PM Modi : అవినీతి..అశ్రిత పక్షపాతం కాంగ్రెస్ నైజం – మోదీ
సంచలన ఆరోపణలు చేసిన ప్రధానమంత్రి
PM Modi : గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు మరింత వేడిని రాజేస్తున్నాయి. ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ సందర్భంగా ఆయన ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. నిన్నటి దాకా రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు. బుధవారం ఏకంగా కాంగ్రెస్ పార్టీ మోడల్ పై నిప్పులు చెరిగారు.
అవినీతి, అశ్రితపక్షపాతం ఆ పార్టీకి ఉన్న నైజం అంటూ మండిపడ్డారు ప్రధానమంత్రి. ఈ రెండు దుర్గుణాలే గుజరాత్ రాష్ట్రాన్ని నాశనం చేసిందని ఆరోపించారు. కానీ భారతీయ జనతా పార్టీ పవర్ లోకి వచ్చాక అనేక సంక్షేమ పథకాలను, కార్యక్రమాలను అమలు చేశామన్నారు.
ఇవాళ దేశానికి గుజరాత్ రోల్ మోడల్ గా ఉందన్నారు. ఆ ఘనత తమదేనని పేర్కొన్నారు. ఇవాళ యువతీ యువకులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించామని చెప్పారు నరేంద్ర మోదీ(PM Modi). తాము అభివృద్దే ఎజెండాగా ముందుకు సాగుతున్నామని కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం కరప్షన్ ఎజెండాగా రాజకీయాలు చేస్తోందంటూ ధ్వజమెత్తారు ప్రధానమంత్రి.
గుజరాత్ లోని మెహసానాలో బీజేపీ అభ్యర్థుల కోసం ప్రచారం చేశారు. అభిమానం, వివక్ష విధానాన్ని తాము ఎన్నడూ అవలంభించ లేదన్నారు నరేంద్ర మోదీ. కాంగ్రెస్ మోడల్ అంటే ఒక్కటే. అవినీతి, బంధు ప్రీతి, వంశ పారంపర్య రాజకీయాలు, మతతత్వం , కుల తత్వం, ఓటు బ్యాంకులకు పాల్పడిందన్నారు.
అధికారంలో ఉండేందుకు ప్రజలను చీల్చారంటూ నిప్పులు చెరిగారు ప్రధానమంత్రి. ప్రస్తుతం దేని కోసం పాదయాత్ర చేస్తున్నారో ఆ పార్టీ నాయకుడికి తెలుసా అని ప్రశ్నించారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మే స్థితిలో లేరన్నారు.
Also Read : రాహుల్ ను సద్దాంతో పోల్చిన సీఎం