PM Modi : అవినీతి దేశాభివృద్దికి అవరోధం – మోదీ
సీబీఐ వజ్రోత్సవాలలో ప్రధానమంత్రి
PM Modi : దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సీరియస్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం దేశానికి అతి పెద్ద అవరోధంగా అవినీతి అనేది మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే ప్రధాన శత్రువు అని పేర్కొన్నారు. దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం సీబీఐ వజ్రోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు నరేంద్ర మోదీ. తాము అధికారంలోకి వచ్చాక కేంద్ర దర్యాప్తు సంస్థలకు పని పెరిగిందన్నారు. గతంలో ఉన్న పాలకులు సీబీఐ, ఈడీ, ఐటీ, ఎన్ఐఏలకు సంబంధించి సరిగా వాడుకోలేదన్నారు ప్రధానమంత్రి.
కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టామని చెప్పారు. తాము వచ్చాక సామాన్యులకు ఆశ, బలాన్ని పెంచిందన్నారు. ఈ తరుణంలో సీబీఐ బ్రాండ్ గా మారిందని ఇదంతా తమ వల్లనే జరిగిందని స్పష్టం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(PM Modi). చాలా కేసులు నమోదు చేయడం అభినందనీయమన్నారు. ఇవాళ దేశ వ్యాప్తంగా ప్రజలలో భారీగా చైతన్యవంతం రావడం ఆనందంగా ఉదన్నారు ప్రధానమంత్రి.
అవినీతి రహిత భారత దేశాన్ని నిర్మించాలన్నదే తన లక్ష్యమని ప్రకటించారు నరేంద్ర మోదీ. సామాన్యుల నుంచి పెద్దల దాకా నీతి, నిజాయితీ ఉండాలని కోరుకునే వారంతా కేంద్ర దర్యాప్తు సంస్థలు కేసులు నమోదు చేయాలని కోరుతున్నారని అన్నారు ప్రధానమంత్రి. సీబీఐ ప్రధాన బాధ్యత దేశాన్ని అవినీతి రహితంగా మార్చాలని కంకణం కట్టుకుందన్నారు.
అవినీతి అనేది సాధారణ నేరం కాదని స్పష్టం చేశారు. గతంలో 2014 నుంచి తాము అవినీతిపై యుద్దం ప్రకటించామని ఆనాటి నుంచి నేటి వరకు కొనసాగుతూనే ఉన్నదన్నారు. ప్రస్తుతం అవినీతిని కట్టడి చేశామన్నారు ప్రధానమంత్రి(PM Modi).
Also Read : పేపర్ లీకేజీపై ఈడీ నజర్