Presidential Counting : భారత రాష్ట్రపతి ఓట్ల లెక్కింపు నేడే
ద్రౌపది ముర్ము వర్సెస్ యశ్వంత్ సిన్హా
Presidential Counting : భారత రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి పోలింగ్ ఫలితాలు ఈనెల 21న గురువారం ప్రకటించనున్నారు. నువ్వా నేనా అన్న రీతిలో సాగింది బీజేపీ ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము, ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా మధ్యన.
ఇక సిన్హాకు 34 పార్టీలు మద్దతు ఇవ్వగా జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ముకు 44 పార్టీలు మద్దతు ప్రకటించాయి. ఇదిలా ఉండగా
ద్రౌపది ముర్ము ఎన్నిక లాంఛనప్రాయమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
విచిత్రం ఏమిటంటే విపక్షాలకు అత్యధిక ఓట్లున్నా కేంద్రంలో కొలువు తీరిన మోదీ త్రయం బెదిరింపులకు పాల్పడడం వల్లే తనకు
ఓట్లు రాలేదని యశ్వంత్ సిన్హా ఆరోపించారు.
ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఉదయం 11 గంటల నుంచి ఓట్ల లెక్కింపు(Presidential Counting) ప్రారంభం కానుంది. సాయంత్రం 4 గంటలకు రాష్ట్రపతి ఫలితం ప్రకటించే అవకాశం ఉంది.
ద్రౌపది ముర్ము విజయం ఖాయమని బీజేపీ శ్రేణులు సంబురాలు చేసేందుకు రెడీ అవుతోంది. రిజల్ట్స్ వచ్చాక తీన్ మూర్తి మార్గ్ లోని ద్రౌపది ముర్ము తాత్కాలిక బస వద్దకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Narendra Modi) వెళతారని, ప్రత్యేక అభినందనలు తెలియ చేస్తారని బీజేపీ ప్రకటించింది.
ఇదిలా ఉండగా ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయం నుండి రాజ్ పథ్ దాకా రోడ్ షోను ప్లాన్ చేసింది. పలువురు సీనియర్లు హాజరవుతారు.
ఇక ద్రౌపది ముర్ము స్వస్థలమైన ఒడిశా లోని రాయంగ్ పూర్ లోని వారంతా 20, 000 మిఠాయిలతో సంబురాలు చేసుకునేందుకు
సిద్దంగా ఉన్నారు.
ఇక ఓట్ల లెక్కింపు విషయానికి వస్తే ముందు క్రమబద్దీకరణ చేస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేల ఓట్లు వేరు చేస్తారు. ఒక్కో ఎంపీ ఓటు
విలువ 700గా నిర్ణయించారు.
ఒక్కో రాష్ట్ర ఎమ్మెల్యేల ఓటు విలువ వేర్వేరుగా ఉంటుంది. నిర్దిష్ట కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తి ప్రతి అభ్యర్థికి పోలైన
ఓట్లను జోడిస్తారు. మొత్తాన్ని రెండుతో భాగిస్తారు. దానికి 1 జోడిస్తారు.
ఆ తర్వాత కోటా నిర్ణయిస్తారు. ఈ విలువ కంటే ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు.
Also Read : ధాన్యం కొనుగోలుపై రాజకీయం తగదు