Sc Internet Suspension : ఇంట‌ర్నెట్ స‌స్పెన్ష‌న్ పై కోర్టు కామెంట్స్

కేంద్ర ఐటీ శాఖ స్పందించాల‌ని ఆదేశం

Sc Internet Suspension : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ఇంట‌ర్నెట్ స‌స్పెన్ష‌న్ (నిషేధం) పై (Sc Internet Suspension) కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ‌ను స్పందించాల్సిందిగా ఆదేశించింది.

కొన్ని ప‌రీక్ష‌ల స‌మ‌యంలో ఇంట‌ర్నెట్ ను నిలిపి వేసేందుకు ఏదైనా ప్రామాణిక ప్రోటోకాల్ అనేది ఉందా అని ప్ర‌శ్నించారు. ఈ మేర‌కు అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఐటీ మంత్రిత్వ శాఖ‌కు స్ప‌ష్టం చేసింది.

ఇదిలా ఉండ‌గా ఎగ్జామ్స్ స‌మ‌యంలో ఎందుకు స‌స్పెన్ష‌న్ విధిస్తున్నారంటూ పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై శుక్ర‌వారం విచార‌ణ చేప‌ట్టింది కోర్టు.

మోసాల‌ను నిరోధించే కార‌ణాల‌తో ఇంట‌ర్నెట్ సేవ‌ల‌ను నిలిపి వేయ‌వ‌ద్దని, ఈ మేర‌కు రాష్ట్రాల‌ను ఆదేశించాల‌ని కోరుతూ సాఫ్ట్ వేర్ ఫ్రీడ‌మ్ లా సెంట‌ర్ దాఖ‌లు చేసింది పిటిష‌న్ ను.

ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ధ‌ర్మాస‌నం కేంద్ర ఎల‌క్ట్రానిక్ , ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ మంత్రిత్వ శాఖకి నోటీసు జారీ చేసింది. భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ యుయు ల‌లిత్ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం ప్ర‌తిస్పంద‌న‌ను కోరింది.

పిటిష‌న‌ర్ లేవ‌నెత్తిన లేదా ప్ర‌స్తావించిన ఫిర్యాదుకు సంబంధించి ఏదైనా ప్రామాణిక ప‌ర‌మైన ప్రోటోకాల్ ఉందా అని నిల‌దీసింది కేంద్రాన్ని. ఇందుకు వెంట‌నే అఫిడ‌విట్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

పిటిష‌న‌ర్ త‌ర‌పున న్యాయ‌వాది వృందా గ్రోవ‌ర్ వాదించారు. ఇది చ‌ట్ట ప‌ర‌మైన సేవ‌ల సంస్థ‌, సాఫ్ట్ వేర్ ఫ్రీడ‌మ్ లా సెంట‌ర్ , డిజిట‌ల్ హ‌క్కులు , డిజిట‌ల్ స్వేచ్ఛ‌ల ప్ర‌చారం , ర‌క్ష‌ణ కోసం ప‌ని చేస్తుంద‌న్నారు.

టెలికాం స‌ర్వీస్ షట్ డౌన్ ల ఏక‌ప‌క్ష అన్యాయ‌మైన ప‌ద్ద‌తిని నిలిపి వేయాల‌ని, ఇది చ‌ట్టానికి విరుద్ద‌మ‌న్నారు. భారత రాజ్యాంగ సారాంశానికి విరుద్ద‌మ‌ని కోర్టును ఆశ్ర‌యించార‌ని పిటిష‌న్ పేర్కొంది.

Also Read : జాతీయ ప్ర‌యోజ‌నాల‌పై కేంద్రం ఫోక‌స్

Leave A Reply

Your Email Id will not be published!