Tejashwi Yadav : రైల్వే హొటల్ కేసులో కోర్టుకు రావాల్సిందే
డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు షాక్
Tejashwi Yadav : బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ కు బిగ్ షాక్ తగిలింది. రైల్వే హోటల్ కేసులో తేజస్వి యాదవ్ స్వయంగా కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది.
ఒక ప్రైవేట్ సంస్థకు ఐఆర్సీటీసీ హోటళ్ల నిర్వహణ కాంట్రాక్టును మంజూరు చేయడంలో జరిగిన అవకతవకలకు సంబంధించి తేజస్వి యాదవ్ పై కేసు నమోదైంది. పదే పదే రాలేనంటూ తప్పించు కోవడం ఇక కుదరదని స్పష్టం చేసింది.
అయితే తేజస్వి యాదవ్ తరపు న్యాయవాది ప్రతిస్పందన దాఖలు చేసేందుకు కోర్టు సమయం ఇచ్చింది. ఇదిలా ఉండగా ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ కు సంబంధించి బెయిల్ ను రద్దు చేయాలని కోరుతూ కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) పిటిషన్ దాఖలు చేసింది.
ఇందుకు సంబంధించి స్వయంగా హాజరు కావాలని బీహార్ ఉప ముఖ్యమంత్రి , ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ను ఢిల్లీ కోర్టు బుధవారం ఆదేశించింది. యాదవ్ తరపు న్యాయవాదికి వెసులుబాటు కల్పించింది.
ప్రత్యేక న్యాయమూర్తి గీతాంజలి గోయెల్ అక్టోబర్ 18న డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్(Tejashwi Yadav) వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని ఆదేశించింది. అంతకు ముందు సెప్టెంబర్ 17న దర్యాప్తు సంస్థ సమర్పించిన దరఖాస్తుపై కోర్టు యాదవ్ కు నోటీసు జారీ చేసిందింది.
ఈ మేరకు సమాధానం ఇవ్వాలని కోరింది. ఇదిలా ఉండగా యాదవ్ పై జారీ చేసిన సమన్లకు అనుగుణంగా కోర్టు 2018 అక్టోబర్ లో బెయిల్ మంజూరు చేసింది.
Also Read : లిక్కర్ స్కాంలో విజయ్ నాయర్ అరెస్ట్