CJI Chandrachud : కోర్టులు ప్రజలకు చేరువ కావాలి – సీజేఐ
సామాన్యులకు న్యాయం అందాలి
CJI Chandrachud : కోర్టులు ప్రజలకు చేరువ కావాల్సిన అవసరం ఉందన్నారు భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి సీజేఐ డీవై చంద్రచూడ్. రాజ్యాంగ దినత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సీజేఐ(CJI Chandrachud) పాల్గొని ప్రసంగించారు. న్యాయవాద వృత్తిలో అట్టడుగు వర్గాల ప్రాతినిధ్యం తప్పనిసరిగా పెంచాలని స్పష్టం చేశారు.
న్యాయ వ్యవస్థ కింది స్థాయి దాకా చేరుకోవాలి. మన లక్ష్యం ఒక్కటే సామాన్యులు, పేదలు, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన రీతిలో న్యాయం అందించడం. దానిని నెరవేర్చాల్సిన బాధ్యత న్యాయమూర్తులు అందరిపై ఉందన్నారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో న్యాయ వ్యవస్థపై దురభిప్రాయాలు ఉన్నాయని వాటిని తొలగించాలంటే న్యాయ వ్యవస్థలైన కోర్టులు పారదర్శకంగా, ప్రజలకు సేవలు చేయడంలో కీలక పాత్ర పోషించాలని సూచించారు జస్టిస్ డీవై చంద్రచూడ్(CJI Chandrachud). సాంకేతికత మౌలిక సదుపాయాలను కూల్చి వేయ కూడదన్నారు.
అందరికీ న్యాయం చేయాల్సిన అవసరాన్ని మరోసారి నొక్కి చెప్పారు. మన లాంటి వైవిధ్య భరితమైన దేశంలో న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతి ముఖ్యమైన సవాలు ఒక్కటే. అదేమిటంటే సరైన న్యాయం సకాలంలో అందడం. అది అందాలంటే న్యాయమూర్తులు కీలక పాత్ర పోషించాలన్నారు జస్టిస్ చంద్రచూడ్.
సుప్రీంకోర్టు తిలక్ మార్ట్ లో ఉన్నా ఇవాళ న్యాయ పరంగా దేశానికి కేంద్ర బిందువు అని స్పష్టం చేశారు. 137 కోట్ల మంది భారతీయులు మన వైపు చూస్తున్నారన్న ఎరుకతో బాధ్యతలు నిర్వహించాలని హితవు పలికారు సీజేఐ ధనంజయ వై చంద్రచూడ్. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Also Read : ప్రజాస్వామంలో ఏ సంస్థా పరిపూర్ణం కాదు