Covid 19 India Alert : దేశం లో కరోనా హెచ్చరికలు అప్రమత్తమైన కేంద్రం

Covid 19 India Alert : ఇప్పుడిప్పుడే కరోనా రక్కసి నుండి బయటపడుతున్నామని అనుకుంటున్న తరుణంలో కేసుల పెరుగుదల ప్రజలను టెన్షన్ పెడుతుంది. ఈ క్రమంలో కేంద్రం అలర్ట్ అయింది. దేశంలో రోజురోజుకు పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి.

ముఖ్యంగా గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రలో కేసులు భారీగా నమోదవుతున్నాయి(Covid 19 India Alert). ఈ క్రమంలో కరోనా కేసుల పెరుగుదలపై కేంద్రం హై అలర్ట్ అయింది. అత్యధిక కేసులు నమోదు అవుతున్న రాష్ట్రాలకు ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.

కరోనా కేసులు మళ్లీ పరుగుతున్న నేపథ్యంలో ఆయా రాష్ట్రాల అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది. అంతేకాదు ఏప్రిల్ 10,11వ తేదీల్లో మాక్ డ్రిల్ కూడా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.కాగా దేశంలో గత కొన్నిరోజులుగా 1000కి పైగా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా ఇవాళ 1590 కేసులు నమోదు కావడం గమనార్హం.

ఆరోగ్య శాఖ సమాచారం మేరకు తాజాగా శుక్రవారం 4.98 శాతం , శనివారం 6.66 శాతం పాజిటివ్‌ రేటుతో 152 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంతలో, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం మరో ఆరు మరణాలు నమోదయ్యాయి: మహారాష్ట్ర నుండి ముగ్గురు మరియు కర్ణాటక, రాజస్థాన్ మరియు ఉత్తరాఖండ్ నుండి ఒక్కొక్కరు.

వైరల్ ఇన్‌ఫెక్షన్ నుండి కోలుకున్న వారి సంఖ్య 4,41,62,832కి చేరుకోగా, కేసు మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం, దేశంలో ఇప్పటివరకు 220.65 కోట్ల కోవిడ్ వ్యాక్సిన్‌లు ఇవ్వబడ్డాయి.

Also Read : రైతులకు గుడ్ న్యూస్ ! పంట మద్దతు ధర పెంచిన కేంద్రం

Leave A Reply

Your Email Id will not be published!