CV Anand CP : గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే కొడుకు – కొత్వాల్
ఆరుగురిలో ఐదుగురు మైనర్లు
CV Anand CP : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ అమ్నీషియా పబ్ మైనర్ బాలిక గ్యాంగ్ రేప్ కేసు ను ఎట్టకేలకు ఛేదించారు పోలీసులు. ఈ మేరకు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఘటనకు సంబంధించి వివరాలు వెల్లడించారు.
ఇప్పటికే ఎమ్మెల్యే రఘునందన్ రావు సంచలన ఆరోపణలు చేయడంతో కేసుపై ఉత్కంఠ పెరిగింది. ఘటనలో నిందితులంతా ఎంఐఎం నేతల కుమారులే కావడం విశేషం.
రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ మనుమడికి క్లీన్ చిట్ ఇచ్చారు సీపీ(CV Anand CP). ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు కూడా ఉన్నాడని తేల్చేశారు. నిన్నటి దాకా లేరన్నారు.
కానీ ఇవాళ ఉన్నారని తెలిపారు. గ్యాంగ్ రేప్ కేసులో అతడి పాత్ర లేకున్నా బెంజ్ కారు లో బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ వెల్లడించారు.
ఐపీసీతో పాటు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. మొత్తం ఆరుగర్ని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఇన్ స్టాగ్రామ్ ద్వారా కథ నడిపించారు.
పక్కా ప్లాన్ ప్రకారమే స్కెచ్ వేశారు. గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారని వెల్లడించారు సీపీ(CV Anand CP). పబ్ లో రొమేనియా బాలికతో డ్యాన్స్ చేశారు. ముందుగా అనుకున్న ప్రకారమే ట్రాప్ లోకి దించారు.
బెంజ్ కారులో బాలిక, ఎమ్మెల్యే కుమారుడితో పాటు మరో ముగ్గురు బాలురు ఎక్కారు. దీని వెనుక ఇన్నోవా కారులో డ్రైవర్ జమీల్ , సాదుద్దీన్ , మరో ముగ్గురు అనుసరించారని తెలిపారు. ఎమ్మెల్యే కొడుకు బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు.
ఫోన్ కాల్ రావడంతో వెళ్లి పోయాడని , అయినా కేసు నమోదు చేశామన్నారు. ఐపీసీ లోని 354, 323 తో పాటు పోక్సో యాక్ట్ లోని 9(జీ) రెడ్ విత్ 10 సెక్షన్ల కింద ఆరోపణలు చేశారు.
Also Read : స్కెచ్ వేశారు గ్యాంగ్ రేప్ చేశారు – సీపీ