CP CV Anand : 16 లోగా గ‌న్స్ ఇవ్వాల్సిందే

పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్

CP CV Anand : హైద‌రాబాద్ – న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ సీవీ ఆనంద్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మంగ‌ళ‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల తేదీని ప్ర‌క‌టించింది కేంద్ర ఎన్నిక‌ల సంఘం. ఈనెల 9వ తేదీ నుంచే ఎన్నిక‌ల కోడ్ అమ‌లులోకి వ‌చ్చింద‌ని చెప్పారు సీపీ సీవీ ఆనంద్.

CP CV Anand Instructions

ఇందులో భాగంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో గ‌న్స్ లైసెన్సులు పొందిన వారు, తుపాకులు, ఆయుధాలు క‌లిగి ఉన్న వారు వెంట‌నే త‌మ వ‌ద్ద ఉన్న వాటిని ఆయా పోలీస్ స్టేష‌న్ ల‌లో లేదా ఎస్పీ కార్యాల‌యంలో లేదా సిటీ క‌మిష‌న‌రేట్ లో అప్ప‌గించాల‌ని ఆదేశించారు.

మొత్తం గ‌న్స్ పొందిన వారి పూర్తి వివ‌రాలు త‌మ వ‌ద్ద ఉన్నాయ‌ని, ఈ మేర‌కు ప్ర‌తి ఒక్క‌రికీ అక్టోబ‌ర్ 16 డెడ్ లైన్ విధించిన‌ట్లు స్ప‌ష్టం చేశారు సీపీ సీవీ ఆనంద్(CP CV Anand). ఇప్ప‌టికే కేంద్ర ఎన్నిక‌ల సంఘం, రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం ఆదేశాలు జారీ చేసింద‌న్నారు.

ఎవ‌రైనా అక్ర‌మంగా క‌లిగి ఉన్నా వెంట‌నే రంగంలోకి దిగుతామ‌ని, చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు సీపీ ఆనంద్. ఎవ‌రైనా స‌రే ఏ స్థాయిలో ఉన్న వారైనా, ఏ రంగానికి చెందిన వారైనా స‌రే తాము వెసులుబాటు ఇచ్చే ప్ర‌స‌క్తి లేద‌ని హెచ్చ‌రించారు.

ఈనెల 30న పోలింగ్ జ‌ర‌గ‌నుంది తెలంగాణ‌లో. డిసెంబ‌ర్ 3న ఫ‌లితాలు రానున్నాయి. ఎన్నిక‌ల కోడ్ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం ఈసీ చెప్పిన‌ట్లు చేయాల్సిందే.

Also Read : AP CID : నారాయ‌ణ అల్లుడికి బిగ్ షాక్

Leave A Reply

Your Email Id will not be published!