CPI Narayana : మేం క‌లిస్తే కేసీఆర్ కు డిపాజిట్లు రావు

సీపీఐ నేత నారాయ‌ణ షాకింగ్ కామెంట్స్

CPI Narayana : కాంగ్రెస్ , క‌మ్యూనిస్టు పార్టీలు క‌లిస్తే సీఎం కేసీఆర్ కు డిపాజిట్లు కూడా రావ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు సీపీఐ పార్టీ జాతీయ కార్య‌ద‌ర్శి నారాయ‌ణ(CPI Narayana) అన్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

CPI Narayana Comments on KCR

జాతీయ స్థాయిలో ప్ర‌తిప‌క్ష పార్టీల‌న్నీ ఇండియా పేరుతో కూట‌మిగా ఏర్ప‌డ్డాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా భాగ‌స్వామ్యం పంచుకున్నాయి. వ‌చ్చే ఏడాది 2024లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ త‌రుణంలో అన్ని పార్టీలు క‌లిసి క‌ట్టుగా ఉమ్మ‌డి అభ్య‌ర్థుల‌ను బ‌రిలోకి దింప‌నున్నాయి.

దీంతో నిన్న‌టి దాకా ఉప్పు నిప్పుగా ఉంటూ వ‌చ్చిన కాంగ్రెస్, క‌మ్యూనిస్టు పార్టీలు ఉమ్మ‌డి వేదిక‌ను పంచుకోనున్నాయి. ఇదిలా ఉండ‌గా తెలంగాణ రాష్ట్రంలో ప‌రిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో క‌మ్యూనిస్టులు భార‌త రాష్ట్ర స‌మితి పార్టీకి మ‌ద్ద‌తు ప‌లికాయి. మునుగోడు ఉప ఎన్నిక‌ల్లో బేష‌ర‌తుగా బీఆర్ఎస్ కు స‌పోర్ట్ చేశాయి.

ఇక తెలంగాణ‌లో త్వ‌ర‌లో శాస‌న స‌భ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే ప‌వ‌ర్ లో ఉన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ 119 స్థానాల‌కు గాను 115 మంది అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేశారు. ఇదే స‌మ‌యంలో కొన‌క‌ళ్ల నారాయ‌ణ చేసిన వ్యాఖ్య‌లు అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకున్నాయి.

Also Read : Uttam Kumar Reddy : అబ‌ద్దాల‌కోరు కేసీఆర్ – ఉత్త‌మ్

Leave A Reply

Your Email Id will not be published!