CR Kesavan Resign : కాంగ్రెస్ పార్టీకి సీఆర్ కేశ‌వ‌న్ గుడ్ బై

సి. రాజ‌గోపాలాచారి ముని మ‌నవ‌డు

CR Kesavan Cong Resign : కాంగ్రెస్ పార్టీని వీడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. మ‌రో వైపు ఆరోప‌ణ‌లు కూడా వినిపిస్తున్నాయి. ఈ త‌రుణంలో మ‌రో షాక్ త‌గిలింది పార్టీకి. సి. రాజ‌గోపాలాచారి ముని మ‌నవ‌డు సీఆర్ కేశ‌వ‌న్ కాంగ్రెస్ పార్టీ(CR Kesavan Cong Resign) నుంచి వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. గురువారం ఆయ‌న పార్టీకి రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.

ఇదే విష‌యాన్ని ఆయ‌న జాతీయ మీడియాతో పంచుకున్నారు. తాను కొత్త బాట ప‌ట్టాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని చెప్పారు. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు తాను ఎవ‌రితోనూ మాట్లాడ‌లేద‌ని స్ప‌ష్టం చేశారు సీఆర్ కేశ‌వ‌న్(CR Kesavan). త‌ర్వాత ఏం జ‌రుగుతుంద‌నే దానిపై త‌న‌కు తెలియ‌ద‌న్నారు. పార్టీ దేనిక ప్ర‌తీక అనే దానితో ఇక‌పై ఏకీభ‌విచ లేనంటూ లేఖ‌లో పేర్కొన్నారు.

కాంగ్రెస్ పార్టీ కోసం అంకిత భావంతో ప‌ని చేసినా ప‌ట్టించు కోవ‌డం లేద‌ని వాపోయారు. ఆనాటి విలువ‌లు నేడు పార్టీలో క‌నిపించ‌డం లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు సీఆర్ కేశ‌వ‌న్. ఇదిలా ఉండ‌గా త‌న ముత్తాత సి. రాజ‌గోపాలాచారి భార‌త దేశానికి తొలి గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్ గా ప‌ని చేశారు.

రెండు ద‌శాబ్దాల‌కు పైగా సీఆర్ కేశ‌వ‌న్ కాంగ్రెస్ పార్టీకి సేవ‌లు అందించారు. కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా చ‌త్తీస్ గ‌ఢ్ లోని రాయ‌పూర్ లో పార్టీకి సంబంధించి ప్లీన‌రీ స‌మావేశాలు జ‌రుగుతున్నాయి. ఈ కీల‌క స‌మ‌యంలో సీఆర్ కేశ‌వ‌న్ పార్టీకి గుడ్ బై చెప్ప‌డం సీనియ‌ర్ల‌కు షాక్ గురి చేసింది. కొత్త దారిని ఎన్నుకోవాల‌ని అనుకున్నా. అందుకే భార‌త్ జోడో యాత్ర‌లో పాల్గొన‌లేద‌ని తెలిపారు.

Also Read : ప‌వ‌న్ ఖేరాకు నిర‌స‌న సెగ

Leave A Reply

Your Email Id will not be published!