Punjab Cabinet ADR : ఆప్ మంత్రులు మామూలోళ్లు కాదప్పా
ఏడుగురిపై క్రిమినల్ కేసులు..కోట్లల్లో ఆస్తులు
Punjab Cabinet ADR : అవినీతి, అక్రమాలకు తావు లేదని లంచం అడిగితే తనకు ఫోన్ లేదా మెస్సేజ్ చేయమని సంచలన ప్రకటన చేసిన పంజాబ్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) కు కోలుకోలేని షాక్ తగిలింది.
విచిత్రం ఏమిటంటే పంజాబ్ ప్రభుత్వంలో మంత్రులుగా కొలువు తీరిన 10 మందిలో ఏకంగా ఏడుగురు మంత్రులపై క్రిమినల్ కేసులు ఉన్నాయి. అంతే కాదు కోట్లల్లో ఆస్తులు ఉండడం విస్తు పోయేలా చేసింది.
ప్రజల కోసం పారదర్శక పాలన సాగిస్తానని ముందు నుంచీ ప్రకటిస్తూ వస్తున్న సీఎం మాన్ కు ఇది పెద్ద దెబ్బేనని చెప్పక తప్పదు. నలుగురు మంత్రులైతే తీవ్ర నేరారోపణలు ఎదుర్కొంటుండడం విశేషం.
దేశ వ్యాప్తంగా నేతల చిట్టా విప్పే అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ – ఏడీఆర్(Punjab Cabinet ADR) వీరి బండారాన్ని బయట పెట్టింది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వీరు దాఖలు చేసిన నామినేషన్లలో సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా వీరి గురించి బట్ట బయలు చేసింది.
సీఎం మాన్ తో కలుపుకుని మొత్తం 11 మంది కేబినెట్ లో 7 మందిపై అంటే 64 శాతం నేరారోపణ కేసులు ఉన్నాయని వెల్లడించింది. 36 శాతం అత్యధిక నేరారోపణలు ఉన్నట్లు తెలిపింది.
మొత్తం కేబినెట్ లో 9 మంది కోటీశ్వరలని స్పష్టం చేసింది ఏడీఆర్. బ్రామ్ శంకర్ ( జింప్రా ) అత్యధిక ధనవంతుడని తెలిపింది. ఆయన ఆస్తుల వాల్యూ రూ. 8.56 కోట్లుగా తేల్చింది.
లాల్ చంద్ కు రూ. 6.19 కోట్లు ఉన్నాయని వివరించింది. ఐదుగురు మంత్రుల్లో 10 నుంచి 12 దాకా చదివారని తెలిపింది.
Also Read : ప్రమోద్ సావంత్ కు లైన్ క్లియర్