Manipur CM : మ‌ణిపూర్ బీజేపీలో సంక్షోభం అబ‌ద్దం

స్ప‌ష్టం చేసిన సీఎం ఎన్ బీరేన్ సింగ్

Manipur CM : మ‌ణిపూర్ భార‌తీయ జ‌న‌తా పార్టీలో ఎలాంటి సంక్షోభం లేద‌ని స్ప‌ష్టం చేశారు ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎన్ బీరేన్ సింగ్. ఇదిలా ఉండ‌గా ఇదే పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప‌రిపాల‌నా ప‌ద‌వుల‌కు గుడ్ బై చెప్పారు. సీఎం ఒంటెద్దు పోక‌డ‌పై వారు గుర్రుగా ఉన్నారు. ఇంఫాల్ రాష్ట్ర బీజేపీ కీల‌క స‌మావేశం నిర్వ‌హించింది. ఈ సంద‌ర్భంగా హాజ‌రైన సీఎం కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

పార్టీ అన్నాక కొన్ని అభిప్రాయ భేదాలు ఉండ‌డం మామూలేన‌న్నారు. ప్ర‌స్తుతం త‌మ పార్టీలో ఎవ‌రూ వ్య‌తిరేకంగా మాట్లాడ‌ర‌ని, ముందు నుంచి క్ర‌మ‌శిక్ష‌ణ క‌లిగిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు ఉన్నార‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎన్ బీరేన్ సింగ్(Manipur CM).

బీజేపీ కీల‌క స‌మావేశం ముగిసిన అనంత‌రం శుక్ర‌వారం సీఎం మీడియాతో మాట్లాడారు. మ‌ణిపూర్ బీజేపీ యూనిట్ లో ఎలాంటి సంక్షోభం లేదు. వ్య‌క్తిగ‌త కార‌ణాల రీత్యా బ‌య‌ట‌కు వెళితే అది సంక్షోభం ఎలా అవుతుంద‌ని ప్ర‌శ్నించారు బీరేన్ సింగ్.

సంక్షోభం ఉందా అని మీడియా అడిగిన ప్ర‌శ్న‌కు కూల్ గా స‌మాధానం చెప్పారు సీఎం. ఒక మంత్రి నా నుండి సెలవు తీసుకున్నారు. ఆయ‌న ఇండోర్ వెళ్లారు. వారిలో ముగ్గురు ఢిల్లీలో ప్ర‌స్తుతం అనారోగ్య రీత్యా వైద్యం తీసుకుంటున్నారు. ఇందులో సంక్షోభం అనేది మీకు క‌నిపిస్తుందా అని ఎదురు ప్ర‌శ్న వేశారు.

Also Read : ఢిల్లీ పోలీస్ స్కాం బాధ్య‌త ఎల్జీదే

Leave A Reply

Your Email Id will not be published!