Devendra Fadnavis : మరాఠాలో సంక్షోభం ఢిల్లీకి ఫడ్నవీస్
మంత్రి ఏక్ నాథ్ షిండేతో కలిసి ఎమ్మెల్యేలు క్యాంప్ లో
Devendra Fadnavis : మహారాష్ట్రలో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మహా వికాస్ అఘాడీ పేరుతో సంకీర్ణ సర్కార్ ను ఏర్పాటు చేశారు.
తాజాగా రాష్ట్రంలో జరిగిన రాజ్యసభ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమిలో ఉన్న శివసేన, కాంగ్రెస పార్టీలకు కోలుకోలేని షాక్ తగిలింది.
రాజ్యసభ ఎన్నికల్లో ఆరు స్థానాలకు గాను ఎంవిఏ మూడు సీట్లు గెలుపొందగా మరో మూడు సీట్లను భారతీయ జనతా పార్టీ చేజిక్కించుకుంది.
ప్రస్తుతం శాసన మండలి సభ ఎన్నికల్లో బిగ్ షాక్ తగిలింది బీజేపీ నుంచి. మొత్తం 10 ఎమ్మెల్సీ సీట్లకు ఎన్నికలు జరిగాయి. అయిదు సీట్లను శివసేన కూటమి చేజిక్కించుకోగా మరో ఐదు సీట్లను బీజేపీ కైవసం చేసుకుంది.
ఎన్నికల ఫలితాలు వెలువడిన గంట లోపే శివసేన పార్టీకి చెందిన రాష్ట్ర పట్టణాభివృద్ది శాఖ మంత్రి ఏక్ నాథ్ షిండే ఆగ్రహంతో ఉండడం, ఆయనతో పాటు పలువురు ఎమ్మెల్యేలు కలిసి వెళ్లడం తీవ్ర కలకలం రేపింది.
ప్రస్తుతం షిండే తిరుగుబాటు ప్రకటించిన ఎమ్మెల్యేలతో కలిసి గుజరాత్ లోని సూరత్ ఓ హోటల్ లో మకాం వేశారు. ఇదే సమయంలో అత్యవసర సమావేశం ఉందని ప్రకటించారు సీఎం ఉద్దవ్ ఠాక్రే.
ఈ తరుణంలో రాజకీయ సంక్షోభం నెలకొనడాన్ని తీవ్రంగా గమనించిన భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం (హై కమాండ్ ) వెంటనే ఢిల్లీకి రావాల్సిందిగా బీజేపీ మరాఠా చీఫ్,
మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) ను ఆదేశించింది. దీంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే బీజేపీ కి చెందిన కేంద్ర మంత్రి ఆ మధ్య సంచలన ఆరోపణలు చేశారు.
Also Read : ఎవరీ ఏక్ నాథ్ షిండే ఏమిటా కథ