Srilanka Clashes : ద్వీప దేశం శ్రీలంకలో రాజకీయ సంక్షోభం నెలకొంది. పెట్రోల్, డీజిల్ , నిత్యవసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎన్నడూ లేని రీతిలో ఆర్థిక సంక్షోభం (Srilanka Clashes )ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. భారీ ఘర్షణలు, కర్ఫ్యూ మధ్య సోమవారం శ్రీలంక ప్రధాన మంత్రి మహింద రాజపక్సే రాజీనామా చేశారు.
ఆయన తప్పు కోవడంతో దేశాధ్యక్షుడు రాజపక్సే అఖిలపక్ష మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు పార్లమెంట్ లోని అన్ని రాజకీయ పార్టీలను ఆహ్వానించాలని భావిస్తున్నారు.
దేశ వ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. సంక్షోభంలో కొత్త మంత్రివర్గానికి మార్గం సుగమం చేసే ఉంది.
దేశంలో కొనసాగుతున్న సంక్షోభానికి పరిష్కారంగా ప్రధాని పదవి నుంచి వైదొలగాలని మహింద రాజపక్సే దిగి పోవాలంటూ కోరినట్లు సమాచారం. ఇదే విషయాన్ని డైలీ మిర్రర్ వెల్లడించింది.
అంతకు ముందు ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవేగయ్య చీఫ సజిత్ ప్రేమదాస మధ్యంతర ప్రభుత్వంలో పీఎం పదవిని అంగీకరించ బోమంటూ స్పష్టం చేశారు.
సోమవారం నిరసనకారులు ప్రధాన మంత్రి మహింద రాజపక్స రాజీనామా (Srilanka Clashes )చేయొద్దంటూ కోరుతూ ప్రధాని అధికారిక నివాసం టెంపుల్ ట్రీస్ ఎదుట ప్రదర్శన చేపట్టారు.
ప్రధానితో భేటీ అనంతరం ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనకారులతో ఘర్షణకు దిగారు. ఈ ఘర్షణల్లో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారందరినీ కొలంబో జాతీయ ఆస్పత్రికి తరలించారు.
భావోద్వేగాలు ఎక్కువగా ఉన్న తరుణంలో ప్రజలు సంయమనం పాటించాలని కోరుతున్నానని ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా మహీందా ట్వీట్ పై శ్రీలంక మాజీ క్రికెటర్ కుమార సంగక్కర స్పందించాడు.
శాంతియుతంగగా నిరసన తెలిపే వారిపై దాడి చేసేందుకు ముందు మీ ఆఫీసుకు వచ్చిన మీ మద్దతుదారులు, గూండాలు , దుండగులు మాత్రమే హింసకు పాల్పడ్డారంటూ ఆరోపించారు.
Also Read : మాతృభూమి కోసం సైనికుల పోరాటం