Gyanvapi Supreme Court : ‘జ్ఞాన‌వాపి’ కేసుపై కీల‌క నిర్ణ‌యం

కీల‌క తీర్పు వెలువ‌రించ‌నున్న సుప్రీం

Gyanvapi Supreme Court :  వార‌ణాసిలోని జ్ఞాన‌వాపి మ‌సీదు కేసులో కీల‌క నిర్ణ‌యం వెలువ‌డ‌నుంది. ఇదిలా ఉండ‌గా వారణాసి లోని ప్ర‌సిద్ద కాశీ విశ్వ‌నాథ దేవాల‌యం ప‌క్క‌నే జ్ఞాన వాపి మ‌సీదు ఉంది.

పూజ‌లు చేసే హ‌క్కును కోరుతూ ఐదుగురు హిందూ మహిళ‌లు పిటిష‌న్ దాఖ‌లు చేశారు. సోమ‌వారం వార‌ణాసి లోని అత్యంత సీనియ‌ర్ న్యాయ‌మూర్తి కోర్టు తీర్పు వెలువ‌రించ‌నుంది.

జ‌స్టిస్ ఎకె విశ్వేషా ఉత్త‌ర్వులు ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంది. మేలో సుప్రీంకోర్టు వార‌ణాసి జిల్లా న్యాయ‌మూర్తి (Gyanvapi Supreme Court) కోర్టుకు కేసును కేటాయించింది.

అప్ప‌టి వ‌ర‌కు విచార‌ణ‌లో ఉన్న దిగువ కోర్టు నుండి దానిని మార్చింది. ఇందుకు సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశించింది. విష‌యం సంక్లిష్ట‌త‌, సున్నిత‌త్వాన్ని దృష్టిలో ఉంచుకుని వార‌ణాసి లోని సివిల్ జ‌డ్జి ముందు ఉన్న సివిల్ దావాను యుపి న్యాయ సేవ‌కు చెందిన సీనియ‌ర్ , అనుభ‌వజ్ఞుడైన న్యాయ అధికారి ముందు విచారించాలని స్ప‌ష్టం చేసింది.

ఈ కేసులో సుప్రీంకోర్టు జోక్యానికి నెల రోజుల ముందు జ్ఞాన‌వాపి మ‌సీదు స‌ముదాయంలో హిందూ దేవుళ్లు , దేవ‌త‌ల విగ్ర‌హాలు ఉన్నాయ‌ని మ‌హిళ‌ల పిటిష‌న్ ఆధారంగా వార‌ణాసి సివిల్ కోర్టు జ్ఞాన వాపి మ‌సీదును చిత్రీక‌రించాల‌ని ఆదేశించింది.

మ‌సీదులో చిత్రీక‌ర‌ణ నివేదిక‌ను సీల్డ్ క‌వర్ లో వార‌ణాసి కోర్టుకు స‌మ‌ర్పించారు. హిందూ పిటిష‌న‌ర్లు వివాదాస్ప‌దంగా కొన్ని గంట‌ల త‌ర్వాత వివ‌రాల‌ను విడుద‌ల చేశారు.

ఇదిలా ఉండ‌గా ముస్లిం ప్రార్థ‌న‌ల‌కు ముందు వాజూ లేదా శుద్దీక‌ర‌ణ ఆచారాల కోసం ఉప‌యోగించే మసీదు కాంప్లెక్స్ లోని ఒక చెరువులో శివ లింగం క‌నిపించింద‌ని నివేదిక పేర్కొంది. అప్ప‌ట్లో కేసును విచారించిన న్యాయ‌మూర్తి ఆ చెరువుకు సీలింగ్ వేయాల‌ని ఆదేశించారు.

Also Read : న‌రేంద్ర మోదీ భార‌తీయ ఆత్మ – ఖాడే

Leave A Reply

Your Email Id will not be published!