Saudi Prince : జర్నలిస్ట్ మర్డర్ కేసులో కీలక మలుపు
ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ కామెంట్స్
Saudi Prince : సౌదీ యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ చిక్కుల్లో పడ్డారు. 2018లో సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్గి హత్యపై తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దీనిపై మానవ హక్కుల సంఘాలు తీవ్రంగా తప్పు పట్టాయి. యుఎస్ వ్యాజ్యం ఎదుర్కొంటున్న సౌదీ అరేబియా తరపు న్యాయవాదులు ఈ కేసుపై కోర్టుకు కీలక విషయాలు వెల్లడించారు.
సౌదీకి రాజుగా ఉన్న సల్మాన్ కు ప్రాసిక్యూషన్ (విచారణ ) నుండి మినహాయింపు లభించిందని తెలిపారు. కాగా సౌదీ క్రౌన్ ప్రిన్స్ ఖషోగ్గి హత్యకు ఆదేశించడాన్ని మొదటి నుంచీ ఖండిస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత అంగీకరించడం కలకలం రేపింది. ఇదిలా ఉండగా ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ తనకు జర్నలిస్ట్ హత్య కేసులో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు.
అవన్నీ నిరాధారమైన ఆరోపణలుగా కొట్టి పారేశాడు. గత వారం ప్రిన్స్ నియామకం రక్షణ కల్పించింది. ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ లో ఖషోగ్గిని సౌదీ ఏజెంట్లు హతమార్చారు. ఈ ఆపరేషన్ లో యుఎస్ ఇంటెలిజెన్స్ కీలక దర్యాప్తు చేపట్టింది. ఆపై ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్(Saudi Prince) ప్రమేయం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేసింది.
గత వారం సల్మాన్ అతనిని రాజ ఉత్తర్వులలో ప్రధానమంత్రిగా నియమించారు. యువరాజు ఇప్పటికే చేపడుతున్న బాధ్యతలకు మరో కొత్త పోస్ట్ క్రియేట్ జరిగింది. సౌదీలో పర్యటించిన బైడెన్ ఖషోగ్గీ హత్యకు సౌదీ ప్రిన్స్ బాధ్యుడంటూ ఆరోపించారు.
యువరాజు విధానాలను విమర్శించిన ఖషోగ్గిని ఇస్తాంబుల్ లోని సౌదీ కాన్సులేట్ లో చంపి ముక్కలు చేశారు. టర్కీకి చెందిన హటీస్ సెంగిజ్ ను వివాహం చేసుకునేందుకు అవసరమైన పత్రాలు పొందేందుకు అక్కడికి వెళ్లాడు.
Also Read : షిండేను బెదిరించిన వ్యక్తి అరెస్ట్