CS Somesh Kumar : మారని స్వరం ఉద్యోగాలు భర్తీ చేస్తాం
త్వరలో కొలువుల నోటిఫికేషన్లు
CS Somesh Kumar : త్వరలో ఉద్యోగాలు భర్తీ చేస్తాం అన్నది ఊత పదంగా మారింది తెలంగాణలో. పక్క రాష్ట్రం ఏపీలో వరుసగా ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేస్తున్నారు.
అంతే కాదు క్యాలెండర్ ఇయర్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా , అసెంబ్లీ సాక్షిగా సీఎం 82 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నా ఇప్పటి వరకు ఒక్కరికి కూడా కొలువు పత్రం ఇచ్చిన దాఖలాలు లేవు. ఆర్థిక శాఖ అనుమతులు ఇవ్వడం, నోటిఫికేషన్లు వేయడం ఆపై భర్తీ ప్రక్రియ నిలిచి పోవడం షరా మామూలుగా మారింది.
మరో వైపు సీఎం ముందస్తు ఎన్నికలపై ఫోకస్ పెడుతుండడంతో లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఆశలు వదులుకున్నారు. ఇదంతా ఎన్నికల స్టంటేనని ఆరోపిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్ సోమేశ్ కుమార్(CS Somesh Kumar) ఊత పదాన్ని వాడారు.
త్వరలో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. ఆయన మాటలు నీటి మూటలేనంటున్నారు నిరుద్యోగులు. వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న 16,940 పోస్టులను భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డితో కలిసి సమీక్ష చేపట్టారు.
ఇప్పటికే 60,929 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేశామన్నారు. ప్రస్తుతానికి టీఎస్పీఎస్సీ, పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు, రెసిడెన్షియల్ రిక్రూట్ మెంట్ బోర్డు, తదితర ఏజెన్సీల ద్వారా నియామకాలు జరుగుతున్నాయని తెలిపారు సీఎస్(CS Somesh Kumar).
ఇదిలా ఉండగా ఆయా శాఖలు ఖాళీల వివరాలు పంపాలని ఆ తర్వాత నోటిఫికేషన్లు జారీ చేస్తామన్నారు.
Also Read : ప్రాణం పోసే వాళ్లకు ప్యాడ్స్ ఇవ్వలేమా