CSK IPL 2023 Champions : అద్భుత విజ‌యం చారిత్రాత్మ‌కం

ఐదోసారి ఐపీఎల్ విజేత‌గా నిలిచిన సీఎస్కే

CSK IPL 2023 Champions : యావ‌త్ భార‌త‌మే కాదు ప్ర‌పంచ‌మంతా ఉత్కంఠ‌తో ఎదురు చూసింది. పొట్టి ఫార్మాట్ ఎందుకింత‌గా పాపుల‌ర్ అయ్యిందో ఐపీఎల్(IPL) ఫైన‌ల్ మ్యాచ్ -2023 చూస్తే తెలుస్తుంది. చివ‌రి బంతి దాకా గెలుపు దోబూచులాడింది. మిస్ట‌ర్ కూల్ మ‌రోసారి త‌నదైన మార్క్ చూపించాడు. వ్య‌క్తిగ‌తంగా తాను రికార్డులు న‌మోదు చేయ‌లేక పోయినా అద్భుత‌మైన నాయ‌కుడిగా త‌న‌ను ప్రూవ్ చేసుకున్నాడు. చెన్నై సూప‌ర్ కింగ్స్ యాజ‌మాన్యం త‌ల ఎత్తుకునేలా చేశాడు. బంతి బంతికి మ్యాచ్ చేతులు మారుతూ వ‌చ్చింది. చివ‌ర‌కు గుజ‌రాత్ కు షాక్ ఇచ్చింది. వ‌రుణ‌డి ఆటంకం మ‌ధ్య డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిని అనుస‌రించారు అంపైర్లు. రిజ‌ర్వ్ డే కూడా మ్యాచ్ కొన‌సాగుతుందా లేదా అన్న అనుమానం క‌లిగింది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే గుజ‌రాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి 214 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. యంగ్ క్రికెట‌ర్ సాయి సుద‌ర్శ‌న్ మ‌రోసారి దంచి కొట్టాడు. త‌న‌దైన శైలిలో రాణించాడు. కేవ‌లం 47 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్న సుద‌ర్శ‌న్ 8 ఫోర్లు 6 సిక్స‌ర్ల‌తో రెచ్చి పోయాడు. 96 ర‌న్స్ చేశాడు. తృటిలో సెంచ‌రీని కోల్పోయాడు. ఇక ఓపెన‌ర్ సాహా 39 బంతులు ఎదుర్కొని 54 ర‌న్స్ చేశాడు. ఇందులో 5 ఫోర్లు ఒక సిక్స‌ర్ ఉన్నాయి. ఇక ఐపీఎల్(IPL) టోర్నీలో రికార్డుల వ‌ర‌ద పారిస్తున్న శుభ్ మ‌న్ గిల్ 20 బంతుల్లో 7 ఫోర్ల‌తో 39 ర‌న్స్ చేశాడు. ధోనీ అద్భుతంగా స్టంపింగ్ చేయ‌డంతో వెనుదిరిగాడు. ఇదే స‌మ‌యంలో వ‌ర్షం రావ‌డంతో మ్యాచ్ ను నిలిపి వేశారు. చివ‌ర‌కు అంపైర్లు డ‌క్ వ‌ర్త్ లూయిస్ ప‌ద్ద‌తిని అనుస‌రించారు.

అర్ధ‌రాత్రి 12.10 గంట‌ల స‌మ‌యంలో సీఎస్కే ముందు 15 ఓవ‌ర్ల‌లో 171 ర‌న్స్ ల‌క్ష్యాన్ని నిర్ణ‌యించారు. ఆరంభం నుంచే 15 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 171 ర‌న్స్ చేసింది. కాన్వే 25 బంతులు ఎదుర్కొని 47 ర‌న్స్ చేశాడు. 4 ఫోర్లు 2 సిక్స‌ర్లు ఉన్నాయి. ఇక శివ‌మ్ దూబే 21 బంతులు ఎదుర్కొని 32 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. గైక్వాడ్ 3 ఫోర్లు ఒక సిక్స‌ర్ తో 26 ర‌న్స్ చేశాడు. అజింక్యా ర‌హానే 13 బంతులు ఎదుర్కొని 2 ఫోర్లు 2 సిక్స‌ర్ల‌తో 27 ర‌న్స్ చేశాడు. అంబ‌టి రాయుడు ఒక ఫోర్ 2 సిక్స‌ర్ల‌తో 19 ప‌రుగులు చేస్తే ర‌వీంద్ర జ‌డేజా ఒక ఫోర్ ఒక సిక్స‌ర్ తో 15 ర‌న్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు.

Also Read : Ravindra Jadeja

Leave A Reply

Your Email Id will not be published!