CSK vs MI IPL 2023 : చెన్నై చేతిలో ముంబై చిత్తు
ఆల్ రౌండ్ షోతో అదుర్స్
CSK vs MI IPL 2023 : ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా జరిగిన కీలక మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ వరుస విజయాలకు బ్రేక్ వేసింది మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. టాస్ గెలిచిన సీఎస్కే స్కిప్పర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ ఆశించిన మేర రాణించ లేక పోయారు. దీంతో 20 ఓవర్లలో 139 పరుగులకే చాప చుట్టేశారు.
అనంతరం మైదానంలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్(CSK vs MI IPL 2023) కేవలం 4 వికెట్లు కోల్పోయి 140 రన్స్ లక్ష్యాన్ని ఛేదించింది. పాయింట్ల పట్టికలో మరో స్థానానికి ఎగ బాకింది. ఇదిలా ఉండగా చెన్నై చేతిలో ముంబై ఓడి పోవడం ఇది రెండోసారి కావడం విశేషం.
చెన్నై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు చేసేందుకు నానా తంటాలు పడ్డారు ముంబై ఇండియన్స్ బ్యాటర్లు. ఆది లోనే ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ గోల్డెన్ డకౌట్ గా వెనుదిరిగాడు. 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయింది. నేహల్ వధేరా , సూర్య కుమార్ యాదవ్ , స్టబ్స్ మాత్రమే రాణించారు. వధేరా చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. నేహల్ ఏకంగా 64 రన్స్ చేశాడు. సూర్యా భాయ్ 26 రన్స్ చేస్తే ట్రిస్టన్ 20 పరుగులతో రాణించారు.
గత కొన్ని మ్యాచ్ లలో ముంబై ఇండియన్స్ అద్భుతంగా ఆడింది. ఆల్ రౌండ్ షోతో ఆకట్టుకుంది. కానీ ఉన్నట్టుండి మరోసారి బోల్తా పడింది చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో.
Also Read : రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటే బెటర్