Sourav Ganguly Comment : దాదా ఎందుకింత బాధ
మహిళా రెజ్లర్లపై కామెంట్స్
Sourav Ganguly Comment : భారత క్రికెట్ లో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ కలిగిన బెంగాల్ టైగర్ , బీసీసీఐ మాజీ చీఫ్ సౌరవ్ గంగూలీ తాజాగా చర్చనీయాంశంగా మారారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి.
గతంలో ఎన్నడూ లేనంతగా సామాజిక మాధ్యమాలలో ట్రెండింగ్ లో నిలిచాడు. తాము లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురవుతున్నామని, వెంటనే భారత రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ , బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను తొలగించాలని డిమాండ్ చేశారు మహిళా రెజ్లర్లు.
అంతే కాదు తమకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. ఆపై దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్షకు దిగారు. గత నెల ఏప్రిల్ 23న రెండోసారి ఆందోళనకు దిగారు. బాధితుల ఆందోళనకు దేశ వ్యాప్తంగా మద్దతు లభించింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఇదే సమయంలో ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే అర్ధరాత్రి ఢిల్లీ ఖాకీలు మల్ల యోధుల వద్దకు చేరుకున్నారు. దురుసు ప్రవర్తనతో వారిని చెల్లా చెదురు చేశారు. ఆపై మహిళా రెజ్లర్లపై దాడికి పాల్పడ్డారు. దీనిపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. పలువురు మహిళా మల్ల యోధులు కన్నీటి పర్యంతం అయ్యారు.
దేశం తరపున ప్రాతినిధ్యం వహించిన రెజ్లర్లు ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 30 మందికి పైగా రోడ్డెక్కారు. కోర్టును ఆశ్రయించడంతో చివరకు ఢిల్లీ పోలీసులు డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై రెండు కేసులు నమోదు చేశారు. ఇందులో ఒకటి పోక్సో చట్టం కింద కేసు నమోదు కావడం గమనార్హం.
ఇక క్రీడా పరంగా చూస్తే ఒలింపియన్ విలుకాడు నీరజ్ చోప్రా, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ కపిల్ దేవ్, వీరేంద్ర సెహ్వాగ్ మాత్రమే మహిళా మల్ల యోధులకు మద్ధతు పలికారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బేటీ బచావో బేటీ పడావో అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదే పదే చెప్పే ప్రకటన కేవలం ప్రచారం వరకు తప్ప ఆదుకోవడానికి కాదంటూ మండిపడ్డారు. ఈ దేశం తలదించుకునే పరిస్థితికి తీసుకు వచ్చేలా చేశారంటూ ప్రధానిపై ఫైర్ అయ్యారు.
ఇదే సమయంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ చీఫ్ పీటీ ఉష కూడా విమర్శలకు గురయ్యారు. ఇదిలా ఉండగా సౌరవ్ గంగూలీ రెజ్లర్లపై నోరు పారేసుకున్నారు. వాళ్లు ఎందుకు ఆందోళన చేస్తున్నారో తనకు అర్థం కావడం లేదంటూ కామెంట్ చేశారు.
దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఒక బాధ్యత కలిగిన గంగూలీ(Sourav Ganguly Comment) ఇలాంటి మాటలు ఎలా మాట్లాడతారంటూ ప్రశ్నించారు. గంగూలీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఈ మొత్తం వ్యవహారంపై తీవ్ర చర్చకు దారి తీస్తున్న తరుణంలో కనీసం మద్దతు ఇవ్వక పోయినా చులకనగా మాట్లాడకుండా ఉంటే బెటర్ అని ఫ్యాన్స్ కోరుతున్నారు. దాదా ఇకనైనా మారాలి. ఆడబిడ్డల కన్నీళ్లను తుడిచే ప్రయత్నం చేయాలి. లేక పోతే చరిత్ర క్షమించదు.
Also Read : టెక్నాలజీ కీలకం న్యాయవ్యవస్థకు అవసరం
