CWC No Polls : సీడబ్ల్యూసీకి ఎన్నికలు లేవు
కేవలం నామినేటెడ్ మాత్రమే
CWC No Polls : కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అత్యున్నత నిర్ణయాధికారం కలిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీకి ఎన్నికలు(CWC No Polls) ఉండవని కేవలం నామినేట్ చేయబడతారని స్పష్టం చేశారు ఆ పార్టీ మీడియా ఇన్ ఛార్జ్ జైరాం రమేష్. గతంలో ఎన్నికలు నిర్వహించాలని పలుమార్లు పట్టుబాట్టరు.
ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు తిరువనంతపురం ఎంపీ శశి థరూర్. అయితే పార్టీలో ఇందుకు సంబంధించి అభిప్రాయ భేదాలు రాలేదన్నారు. మరో వైపు పార్టీకి చెందిన సీనియర్ నాయకులు అజయ్ మాకెన్ , అభిషేక్ సింఘ్వీ, దిగ్విజయ్ సింగ్ ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్లీనరీ సమావేశాలలో ప్రస్తావించారు.
కానీ ఎక్కడా ఆ సీన్ కనిపించ లేదు. శుక్రవారం ప్రారంభమైన ప్లీనరీ మీటింగ్ ఆదివారంతో ముగుస్తుంది. ఇప్పటి వరకు ఆరు తీర్మానాలపై చర్చ జరగనుందని సమాచారం. ఇక కాంగ్రెస్ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ సభ్యులను దాని కొత్త అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నామినేట్ చేస్తారని , ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం(CWC No Polls) జరగదని తెలిపారు జై రాం రమేష్. ఇక కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులందరినీ నామినేట్ చేసేందుకు పార్టీ చీఫ్ ఖర్గేకు అధికారం ఇవ్వాలని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా ఆమోదించిందని వెల్లడించారు.
2024 జాతీయ ఎన్నికల తర్వాత కూడా ఎన్నికలు నిర్వహించవచ్చని పేర్కొన్నారు జైరాం రమేష్. ఇదిలా ఉండగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గుండురావు మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవన్నారు. మల్లికార్జున్ ఖర్గేపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. పార్టీ బలోపేతం కోసం ఆయన సారథ్యంలో పని చేస్తామన్నారు.
Also Read : సిసోడియాను అరెస్ట్ చేసే ఛాన్స్ – సీఎం