D Raja CPI : మోదీ ప్రభుత్వం కాశ్మీర్ శాంతి భద్రతలను కాపాడటంలో విఫలమైంది

చంద్రబాబు, నితీష్ కుమార్‌పై ఆధార పడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని విమర్శించారు...

D Raja : కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి. రాజా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడోసారి అధికారంలోకి వచ్చినప్పట్టికి మోదీ కానీ బీజేపీ తమ గత పాలనను ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూర్చలేదని అన్నారు. సీపీఐ తెలంగాణ రాష్ట్ర నిర్మాణ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశాలకు సీపీఐ(CPI) జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా(D Raja), జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబ శివరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కళ్లపెల్లి శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డి. రాజా మాట్లాడుతూ.. 400స్థానాలతో అధికారం లోకి వస్తామని చెప్పి 250లోపు స్థానాలకే పరిమితం అయిందని చెప్పారు.

చంద్రబాబు, నితీష్ కుమార్‌పై ఆధార పడి ప్రభుత్వం ఏర్పాటు చేసుకుందని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీల కోసమే మోదీ ప్రభుత్వం బడ్జెట్ పెట్టిందన్నారు. పేదల కోసం ఎలాంటి అవకాశం కల్పించలేదని మండిపడ్డారు. దేశంలో నిరుద్యోగ శాతం పెరుగుతుందన్నారు. బడ్జెట్‌లో విద్య, వైద్యం కోసం ఎలాంటి నిధులు కేటాయించలేదని చెప్పారు. అభివృద్ధి చెందిన దేశంగా భారత్ మారిందని చెబుతూనే రేషన్ ఉచితంగా ఇచ్చే పరిస్థితి ఎందుకు ఉందో చెప్పాలని అన్నారు. సెబీ, ఇండెన్ బర్గ్, అదానీ కంపెనీలపై మోీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. విచారణ కోసం కమిటీ ఎందుకు వేయడం లేదని నిలదీశారు. పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న ఘటనపై మోదీ(PM Modi) మౌనం వీడాలని అన్నారు. దేశంలో మహిళలపై దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయని చెప్పారు.

D Raja Comments..

సుప్రీంకోర్టు కల్పించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడిందని ప్రశ్నించారు. మహిళల రక్షణ కోసం పటిష్టమైన చట్టాలు రావాలని అన్నారు. పకడ్బందీగా అమలు చేయాలన్నారు. రిజర్వేషన్, సామాజిక న్యాయం వంటి వాటిని ఎత్తి వేయాలని మోదీ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రైవేట్ సెక్టార్‌లోనూ రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ రాజ్యాంగంపై ప్రత్యక్షంగా దాడి చేస్తున్నాయని అన్నారు. అదానీ, అంబానీలకు బీజేపీ ప్రభుత్వం కొమ్ము కాస్తోందని దుయ్యబట్టారు. ఒకే దేశం ఒకే ఎలక్షన్, ఒకే రిలీజీయాన్, అనే నినాదంతో దేశంలో విచ్చిన్న పాలనా సాగించాలని చూస్తోందని విమర్శించారు.

రాజ్యాంగం ప్లేస్‌లో కొత్త మత తత్వ రాజ్యాంగం తేవాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ చూస్తున్నాయని అన్నారు. ప్రజాస్వామ్య పార్టీలతో కల్సి రాజ్యాంగ రక్షణ కోసం ముందుకు పోతామని చెప్పారు. నిత్యం రామ జపం చేసే బీజేపీకి రామ ప్రదేశంలో ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పారని అన్నారు. దేశం ప్రజా స్వామ్య దేశం అనేది మోదీ గుర్తించాలని చెప్పారు. జమ్మూ, హర్యానా జరగబోయే ఎన్నికలలో బీజేపీకి ప్రజలు బుద్ధి చెప్పడానికి నిర్ణయం తీసుకున్నారని అన్నారు. ఎన్ కౌంటర్లతో అధికారం రాదని చెప్పారు. కాశ్మీర్‌లో శాంతి భద్రతలు రక్షించడంలో మోదీ ప్రభుత్వం విఫలమైందని అన్నారు. వినేష్ పొగట్ ఒలిపింక్‌లో గోల్డ్ మెడల్ తెచ్చేదని అన్నారు. బీజేపీ కుట్రల్లో బలై పోయిందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు ఎమ్మెల్సీ సీట్లు ఇస్తామని చెప్పిందని.. ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ అనేక హామీలు ఇచ్చిందని వాటిని అమలు చేయాలని డి. రాజా కోరారు.

Also Read : CM Chandrababu Naidu : ఎస్సెన్స్ ఫార్మా కంపెనీ ఘటన నా మనసును కలిచివేసింది

Leave A Reply

Your Email Id will not be published!