Daggubati Purandeswari : జ‌న‌సేన‌తోనే బీజేపీ పొత్తు

దగ్గుబాటి పురందేశ్వ‌రి కామెంట్స్

Daggubati Purandeswari : ఆంధ్ర‌ప్ర‌దేశ్ భార‌తీయ జ‌న‌తా పార్టీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి షాకింగ్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏ పార్టీతో పొత్తులు ఉంటాయ‌నే దానిపై కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ సార‌థ్యంలోని జ‌న సేన పార్టీ తోనే బీజేపీ పొత్తు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేశారు.

Daggubati Purandeswari Comment for Alliance

మిగ‌తా పార్టీల‌తో పొత్తు ఉంటుందా అన్న ప్ర‌శ్న‌కు స‌మాధానం దాట వేశారు ద‌గ్గుబాటి పురందేశ్వరి. అయితే మాట మార్చారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉండ‌ద‌ని పేర్కొన్నారు. పొత్తుల విష‌యంపై తాను నిర్ణ‌యం తీసుకోలేన‌న్నారు. ఇది నా చేతుల్లో లేద‌ని స్ప‌ష్టం చేశారు బీజేపీ చీఫ్.

ప్ర‌స్తుతానికి జ‌న సేన పార్టీతోనే త‌మ ప్ర‌యాణం కొన‌సాగుతుంద‌ని , ఇత‌ర పార్టీల గురించి త‌న‌కు తెలియ‌ద‌న్నారు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి(Daggubati Purandeswari ). ఎన్నిక‌ల స‌మ‌యంలో ఎవ‌రితో వెళ్లాల‌నే దానిపై అప్ప‌టి ప‌రిస్థితుల నుంచి నిర్ణ‌యం తీసుకోవడం జ‌రుగుతుంద‌న్నారు.

అయితే ఏ పార్టీతో పొత్తు ఉండాల‌నే దానిపై కేవ‌లం బీజేపీ హై క‌మాండ్ మాత్రమే నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని చెప్పారు బీజేపీ చీఫ్‌. ఇంత‌కు మించి తాను ఏమీ చెప్ప‌లేన‌న్నారు.

Also Read : TDP MLAs Protest : అసెంబ్లీలో టీడీపీ ఆందోళ‌న‌

Leave A Reply

Your Email Id will not be published!