Daggubati Purandeswari : ఏపీ సర్కార్ పై పురందేశ్వరి ఫైర్
కేంద్ర మంత్రి నిర్మలకు ఫిర్యాదు
Daggubati Purandeswari : ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆమె మరోసారి ఏపీ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయవాడ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించారు. ఈ సందర్బంగా పురందేశ్వరి ఆమెను కలుసుకున్నారు. సుదీర్ఘ లేఖ ఇచ్చారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి ఫోరెన్సిక్ ఆడిట్ జరిపించాలని కోరారు.
Daggubati Purandeswari Serious Comments on AP Govt
రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్ల పై, బేవరేజెస్ కార్పొరేషన్ వంటి సంస్థలపై ఫోకస్ పెట్టాలని సూచించారు బీజేపీ చీఫ్. రాష్ట్రంలో అవకతవకలకు కొదవ లేకుండా పోయిందని పేర్కొన్నారు. జగన్ సర్కార్ ఇప్పటి దాకా చేసిన అప్పులు రూ. 10.77 లక్షల కోట్లు అని ఆరోపించారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పట్టించు కోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్లమెంట్ లో ఏపీ సర్కార్ కేవలం రూ. 4.42 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయంటూ అబద్దం చెప్పిందంటూ మండిపడ్డారు దగ్గుబాటి పురందేశ్వరి(Daggubati Purandeswari). ఆర్థిక అవకతవకల నిర్వహణ పైన, కార్పోరేషన్ల రుణాలపైన, ఆస్తులను తనఖా పెట్టి తెచ్చిన అప్పులపై విచారణ జరిపించాలని కోరారు.
Also Read : Kasani Jnaneswar : తెలంగాణ ఎన్నికల బరిలో టీడీపీ