Dalailama Kiss Row : ద‌లైలామా నిర్వాకంపై ఆగ్ర‌హం

బాలుడిని నాలుక‌తో చ‌ప్ప‌రించ‌మ‌న్న

ఆధ్యాత్మిక గురు ద‌లైలామా చిక్కుల్లో ప‌డ్డారు. ఆయ‌న‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు క‌ల‌క‌లం రేపుతోంది. ద‌లైలామా మైన‌ర్ బాలుడిని నాలుక చ‌ప్ప‌రించ‌మ‌ని అడుగుతున్న వీడియో ప్ర‌స్తుతం నెట్టింట్లో వైర‌ల్ గా మారింది.

ఆధ్యాత్మిక నాయ‌కుడిగా గౌర‌వం ఇచ్చేందుకు ద‌లైలామా బాలుడి పెదవుల‌పై ముద్దు ప‌ట్టారు . ల‌క్ష‌లాది మందికి స్పూర్తి దాయ‌కంగా ఉన్న ద‌లైలామా ఇలాంటి చేష్ట‌లు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. ఒక ఆద‌ర్శ‌నీయ‌మైన ప‌ద‌విలో ఉన్న వ్య‌క్తి ఇలాగేనా చేసేది అంటూ మండి ప‌డుతున్నారు.

నువ్వు నా నాలుకను తాక గ‌ల‌వా అంటూ ద‌లైలామా అన‌డం వీడియోలో స్ప‌ష్టంగా క‌నిపించింది. ప్ర‌త్యేకించి మైన‌ర్ బాలుడిని అలా అడ‌గ‌డం పోక్స్ చ‌ట్టం కింద‌కు వ‌స్తుంద‌ని కొంద‌రు పేర్కొంటున్నారు.

ఇది పూర్తిగా అసంబ‌ద్ద‌మైన‌ది. అనైతిక‌మైన‌ద‌ని పేర్కొన్నారు. ఇది చూసేందుకు అస‌హ్యంగా ఉంది. ద‌లైలామా వెంట‌నే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలంటూ మ‌రికొంద‌రు ట్వీట్ చేశారు. మ‌రో వైపు ద‌లైలామాపై డ్రాగ‌న్ చైనా క‌న్నెర్ర చేస్తోంది. టిబెట్ లో వేర్పాటు వాదాన్ని ప్రోత్స‌హిస్తున్నారంటూ ఆరోపించింది.

Leave A Reply

Your Email Id will not be published!