Damodar Raja Narasimha : కాంగ్రెస్ లో కోవర్టులదే రాజ్యం
కోవర్టిజం కాంగ్రెస్ పార్టీని కొంప ముంచుతోంది
Damodar Raja Narasimha : మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజ నర్సింహ (Damodar Raja Narasimha) సంచలన ఆరోపణలు చేశారు. అర్హులైన వారిని, పార్టీ కోసం పని చేస్తున్న వారిని పక్కన పెట్టారని కానీ ఎలాంటి పని చేయనోళ్లకు ప్రయారిటీ ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఇవాళ పార్టీని చూస్తే జాలి కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం దామోదర రాజ నర్సింహ మీడియాతో మాట్లాడారు. అసలైన, సిసలైన కార్యకర్తలు, నాయకులకు గుర్తింపు రావాలని డిమాండ్ చేశారు. మరోసారి ప్రస్తుతం ఏర్పాటు చేసిన కమిటీలపై పునరాలోచించాలని సూచించారు. 85 మంది జనరల్ సెక్రటరీలు అవసరమా అని ప్రశ్నించారు.
ఆ పదవికి విలువ లేకుండా చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవర్టు రాజకీయాలకు పాల్పడుతున్న వారిని గుర్తించాలని కోరారు. హైకమాండ్ ను గౌరవిస్తామని కానీ ఆత్మగౌరవం తమకు ముఖ్యమన్నారు. పదవులు తమకు ముఖ్యమన్నారు. దొంగలు ఎవరో తేల్చండి..కోవర్టులను గుర్తించి బయటకు పంపించాలని కోరారు.
ప్రస్తుతం పార్టీకి కోవర్టిజమనే కొత్త రోగం పట్టుకుందన్నారు మాజీ డిప్యూటీ సీఎం. గత 8 సంవత్సరాలుగా ఈ జాడ్యం పట్టుకుందన్నారు. సిద్దిపేట జిల్లాల్లో కోవర్టులకే పదవులు కట్టబెట్టారంటూ ఫైర్ అయ్యారు. వీరి వల్ల పార్టీకి ఒరిగేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు దామోదర రాజ నర్సింహ(Damodara Raja Narasimha).
కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన జరగాలని స్పష్టం చేశారు. పార్టీని కాపాడు కోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తాను ఎవరికీ వ్యక్తం కాదని స్పష్టం చేశారు. తాను 58 ఏళ్లుగా పార్టీలో కొనసాగుతూ వస్తున్నానని దామోదర రాజ నర్సింహ అన్నారు. తాను సిసలైన పార్టీ కార్యకర్తనని పేర్కొన్నారు.
Also Read : తేజస్విపై నితీశ్ కుమార్ కీలక కామెంట్స్