Damodara Raja Narasimha : ప్రతి ఒక్కరు మాస్క్ ధరించండి
పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం
Damodara Raja Narasimha : హైదరాబాద్ – దేశ వ్యాప్తంగా మరోసారి కరోనా కలకలం రేపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు పీఎం సూచనల మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
Damodara Raja Narasimha Suggests
ఇందులో భాగంగా మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహా(Damodara Raja Narasimha) సమీక్ష చేపట్టారు. ప్రతి ఒక్కరు మాస్క్ ను ధరించాలని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో పండుగల సీజన్ అని, గుంపులుగా ఉండకూడదని సూచించారు.
ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఆస్పత్రుల వద్దకు వెళ్లాలని తెలిపారు డిప్యూటీ సీఎం. అవసరమైన మేరకు చిన్నారుల నుంచి పెద్దల దాకా మాస్క్ లు ధరించాలని స్పష్టం చేశారు . ఇదిలా ఉండగా డిసెంబర్ 8న కేరళ రాష్ట్రంలో కోవిడ్ కు సంబంధించిన కొత్త వేరియంట్ జేఎన్1 వచ్చిందని వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్ద ఎత్తున తరలి వెళుతున్న అయ్యప్ప భక్తులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు దామోదర రాజ నరసింహ. ప్రభుత్వం అలర్ట్ గా ఉందని , ఎవరికైనా ఇబ్బందులు కలిగితే తమకు తెలియ చేయాలని సూచించారు.
Also Read : Hari Chandana Dasari : హరిచందనకు కీలక పోస్టు