Damodara Raja Narasimha : టికెట్ల నిర్వాకం దామోదర ఆగ్రహం
అనుచరులకు కేటాయించని హైకమాండ్
Damodara Raja Narasimha : హైదరాబాద్ – తెలంగాణ కాంగ్రెస్ లో టికెట్ల లొల్లి మళ్లీ మొదలైంది. ఆ పార్టీలో గతంలో డిప్యూటీ సీఎంగా పని చేసిన దామోదర రాజ నరసింహ గుర్రుగా ఉన్నారు. తాజాగా ప్రకటించిన మూడో జాబితాలో 16 మందికి అభ్యర్థులను ఖరారు చేసింది హైకమాండ్.
Damodara Raja Narasimha Comment
దీనిపై తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. తన అనుచరులుగా గుర్తింపు పొందిన కాట శ్రీనివాస్ గౌడ్ తో పాటు నారాయణ ఖేడ్ టికెట్ ను పట్లోల్ల సంజీవ్ రెడ్డికి కేటాయించక పోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీకి రాజీనామా చేస్తానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.
దీంతో రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ గా ఉన్న మాణిక్ రావు ఠాక్రే విషయం తెలుసుకుని మాజీ డిప్యూటీ సీఎం దామోదరకు(Damodara Raja Narasimha) ఫోన్ చేశారు. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దని కోరారు. సమస్యలు వస్తుంటాయని, అన్నీ సర్దుకు పోతాయని సర్ది చెప్పే ప్రయత్నం చేశారు.
ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకుడిగా గుర్తింపు ఉంది దామోదరకు. ఆయన తెలంగాణ ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించారు. పార్టీ పరంగా తన వాయిస్ ను వినిపించే ప్రయత్నం చేశారు. మొదటి నుంచీ కాంగ్రెస్ కండువా కప్పుకుని పని చేస్తూ వచ్చారు. బలమైన వర్గం కూడా ఉంది. విచిత్రం ఏమిటంటే తన వర్గానికి టికెట్లు ఇప్పించుకోక పోవడం ఒకింత విస్తు పోయేలా చేసింది.
Also Read : Trivikram Srinvas : దర్శకుడా కలకాలం వర్ధిల్లు