KTR : విద్యుత్ బిల్లు చట్టంగా మారితే ప్రమాదం
కార్పొరేటీకరించేందుకు కేంద్రం యత్నం
KTR : రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. ఆయన మరోసారి కేంద్రాన్ని తప్పు పట్టారు.
ఇప్పటికే ప్రభుత్వ ఆస్తులను గంప గుత్తగా అమ్ముకుంటూ పోతున్న మోదీ ప్రభుత్వం తాజాగా వ్యవసాయ, విద్యుత్ రంగాలను కూడా బడా బాబులకు కట్టబెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ఇ
దే సమయంలో తాము మొదటి నుంచీ వాటిని వ్యతిరేకిస్తూ వస్తున్నామని చెప్పారు. తాము ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమంటూ స్పష్టం చేశారు. కార్పొరేట్లకు లబ్ది చేకూర్చే ప్రయత్నంలో తలమునకలై ఉందని మండిపడ్డారు కేటీఆర్(KTR).
కేంద్ర విద్యుత్ బిల్లు చట్టంగా మారితే దళితులు, గిరిజనులు, చాకలి, చేనేత, వృత్తి నైపుణ్యం కలిగిన కార్మికులు, క్షురకులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేటీఆర్.
చట్టంగా మారితే రైతులు ఉచిత విద్యుత్ కోల్పోతారని హెచ్చరించారు. ఎస్సీ, ఎస్టీలు, కోళ్ల రైతులు, చాకలి , మంగలి, చేనేత కార్మికులు, ఇతరులు విద్యుత్ సబ్సిడీలకు గుడ్ బై చెప్పాల్సి వస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
విద్యుత్ సరఫరాపై ఆధారపడి రైతులు భూములు సాగు చేసుకుంటున్నారని ఈ చట్టం వస్తే 26 లక్షల పంపు సెట్లపై ప్రభావం పడుతుందన్నారు.
దీని వల్ల వ్యవసాయం మరింత భారంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రైవేట్ సంస్థలకు లబ్ది చేకూర్చేందుకు కేంద్ర సర్కార్ నాటకాలు ఆడుతోందన్నారు కేటీఆర్(KTR).
ప్రైవేట్ కంపెనీలు విద్యుత్ పంపిణీ ప్రారంభిస్తే రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్ ధరల మాదిరిగానే విద్యుత్ చార్జీలు కూడా పెరుగుతాయన్నారు. ధరలు స్థిరంగా ఉండవన్నారు. ఎక్కువగా నష్ట పోయేది తెలంగాణ మాత్రమేనని పేర్కొన్నారు.
Also Read : ఉద్యోగులు వారానికి మూడుసార్లు రావాలి- టీసీఎస్