Dappu Ramesh : జీవితాంతం జనం గుండె చప్పుడు తన డప్పుతో వినిపించియోన కళాకారుడు, యోధుడు డప్పు రమేష్ (Dappu Ramesh)గుండె పోటుతో కన్నుమూశారు. డప్పు రమేష్ గా ఆయన పేరొందారు. జన నాట్యమండలి కళాకారుడిగా పేరొందారు.
ఆయనకు 61 ఏళ్లు. విజయవాడ లోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని అంగలకుదురు ఆయన స్వంతూరు. తెనాలి లోని వీఎస్సార్ కాలేజీలో డిగ్రీ చదివాడు.
అదే క్రమంలో విప్లవ భావజాలానికి ప్రభావితం అయ్యారు. రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ లో చేరాడు. 1981లో పీపుల్స్ పార్టీకి ఆకర్షితుడయ్యాడు. ఆ పార్టీ ఆదేశాల మేరకు దానికి అనుబంధంగా కొనసాగుతున్న జన నాట్య మండలి శిక్షణ తీసుకున్నాడు.
పూర్తి స్థాయి విప్లవ కళాకారుడిగా మారారు. ప్రముఖ కళాకారులు గద్దర్, దివాకర్ లతో కలిసి ఎన్నో ప్రదర్శనలలో పాల్గొన్నారు. జనాన్ని చైతన్యవంతం చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు డప్పు రమేష్.
జన నాట్య మండలి ద్వారా జనం డప్పు చప్పుడు ప్రపంచానికి వినిపించాడు. నల్లమల అడవులతో పాటు దండకారణ్యంలో సంచరించాడు. కొంత కాలం పాటు అజ్ఞాత జీవితాన్ని గడిపారు.
ఇదే సమయంలో ఉద్యమంలో పని చేస్తున్న సహ కళాకారిణిని పెళ్లి చేసుకున్నారు. ఇవాళ ఆయన స్వగ్రామం జూలకల్లులో అంత్యక్రియలు జరగనున్నాయి.
డప్పు రమేష్ మృతి పట్ల పలువురు కళాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గొప్ప కళాకారుడిని కోల్పోవడం బాధాకరమన్నారు. డప్పు వాయించడంలో ఆయన పేరొందారు. చివరకు డప్పునే తన ఇంటి పేరుగా మార్చుకున్నారు రమేష్.
Also Read : 21న అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ?