#HmumairaMustak : తుపాకుల నీడ‌న మెరిసిన హుమైరా ముస్తాక్

హుమైరా..వారెవ్వా

Hmumaira Mustak  : ప్రతి నిత్యం యుద్ధ వాతావరణం నెలకొన్న జమ్మూ , కశ్మీర్ నుంచి ఓ మహిళ రాకెట్ లా దూసుకు వచ్చింది. తాను అందరిలాంటి దానిని కాదని, బంధనాలు తెంచుకుని , పరదాలను దాటుకుని , స్వేచ్ఛ గా తానేమిటో ..తన పవర్ ఏమిటో ఈ ప్రపంచానికి చాటి చెప్పింది. నిత్యం కట్టుబాట్లు, కఠిన నియమాలు, తుపాకుల రణగొణ ధ్వనుల మధ్యన ఓ తెల్లటి పావురం ..పులిలా ..శివంగిలా దూసుకు వచ్చింది.

ఆమెను చూసి కాశ్మీరీ మహిళలు స్ఫూర్తి పొందుతున్నారు. ఆమెను చూసి గర్విస్తున్నారు. ఇంతకూ ఆమె ఎవరంటే హుమైరా ముస్తాక్(Hmumaira Mustak ). ఇప్పుడు సమున్నత భారత దేశంలో ఆమె వైరల్ గా మారారు. ఆమె సాధించిన ఘనత ఏమిటంటే మగాళ్లు సైతం భయానికి లోనయ్యే మోటార్ కార్ రేస్ లో దుమ్ము రేపడం.

అత్యంత ప్రమాదకరమైన ఆటల్లో ఇది కూడా ఒకటి. వృత్తి రీత్యా మెడికల్ స్టూడెంట్ అయినప్పటికీ, ఈ కాశ్మీరీ క్రీడాకారిణికి మాత్రం మోటార్ రేస్ అంటే అభిమానం. అందుకే దానినే ఎంచుకున్నారు. రేయింబవళ్లు కష్టపడ్డారు. అనుకున్నది సాధించే దాకా నిద్ర పోలేదు హుమైరా. జీవితం పట్ల, తన గమ్యం పట్ల పూర్తి నమ్మకంతో ఉన్న ఆమె..దేనినైనా సాధిస్తానని సవాల్ విసురుతోంది.

రండి..పరదాలను దాటుకుని, మిమ్మల్ని మీరు బలోపేతం కమ్మంటూ పిలుపునిస్తోంది ఈ ప్లేయర్. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని జమ్మూ కశ్మీర్ లాంటి రాష్ట్రం నుంచి క్రీడాకారిణిలు రావడం అరుదు. ఎవరో ఒకరో ఇద్దరు తప్ప. అలాంటి రాష్ట్రం నుంచి సంప్రదాయ కట్టుబాట్లను దాటుకుంటూ ఆ ప్రాంతంలోనే తొలి రేసర్ గా చరిత్ర సృష్టించింది హుమైరా ముస్తాక్.

తాజాగా కోయంబత్తూర్ లో జరిగిన జాతీయ రేసింగ్ ఛాంపియన్ షిప్ లో జమ్మూకు ప్రాతినిధ్యం వహించి అందరినీ విస్తు పోయేలా చేసింది. 23 ఏళ్ళ వయసు కలిగిన ఈ అమ్మాయికి సచిన్ అంటే అభిమానం. ఎక్కడ నివశిస్తున్నామన్నది ప్రాధాన్యం కాదు..ఎలా జీవిస్తున్న మన్నదే ముఖ్యం. నాకు ఎప్పుడూ జమ్మూ , కశ్మీర్ సమస్యాత్మక ప్రాంతమని అనిపించలేదు. ప్రతి చోటా ఇబ్బందులు, కస్టాలు ఉంటాయి.

#Humaiవాటిని దాటుకుంటూ పోవడమే. ఈ ప్రాంతం ఈ దేశంలో భాగమే. ఎవరూ కాదనలేని నిజం. అందుకు నేనే సాక్ష్యం అంటోంది హుమైరా ముస్తాక్(Hmumaira Mustak ). అంతేనా నాలాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు. వారందరు బయటకు రావాలి. ఎంతో సామర్త్యం, ప్రతిభ పాటవాలు కలిగిన వారున్నారు. మరింతగా ముందుకు వస్తే అవకాశాలు అందుకోవచ్చు . విజేతలుగా నిలవొచ్చు అంటోంది. నిజం కదూ..నీ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్.

No comment allowed please