#Pistachio : కాన్సర్ ను తరిమికొట్టే పిస్తా..

పిస్తా పప్పులలో బాదం పప్పు కన్నా అధికంగా పోషక పదార్థాలు ఉంటాయి.

Pistachio : మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో నట్స్ ను తప్పకుండా చేర్చుకోవాలి. ఇవి మన శరీరానికి పోషకాలను అందింస్తాయి. వాటిలో పిస్తా పప్పులు ఒకటి. వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవడం వలన ఎన్నో రకాల ప్రయోజనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. పిస్తాను క్రమం తప్పకుండా తీసుకోవడం వలన నేత్ర సమస్యలు తగ్గుతాయి కంటిచూపు స్పష్టంగా ఉండడానికి ఇందులోని పోషకాలు దోహదం చేస్తాయి.

మధుమేహ వ్యాధి ఉన్నవారికి పిస్తా చాలా మేలు చేస్తుంది. ఇది ఇన్సులిన్‌ శాతాన్ని పెంచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. పిస్తా పప్పులలో బాదం పప్పు కన్నా అధికంగా పోషక పదార్థాలు ఉంటాయి. పిస్తాలో ఉండే పీచుపదార్ధం జీర్ణక్రియకు దోహదం చేస్తుంది. కాన్సర్ కారక వైరస్‌లను నియంత్రించడంలో పిస్తాలో ఉండే పోషకాలు మంచి పనితీరు కనబరుస్తాయి. శరీరంలో విడుదలైన వ్యర్థాలను పిస్తా పప్పులు దూరం చేస్తాయి.

డ్రై ఫ్రూట్స్ అన్నింటితో పోలిస్తే ఈ పప్పులలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. గుండె జబ్బులను తగ్గించే గుణం వీటిలో ఉంది. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. తక్కువ తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో బరువు తగ్గేందుకు ఇది ఉపయోగపడుతుంది. పిస్తా పప్పును తీసుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారుతుంది. దీనిలోని విటమిన్‌ ‘ఇ’ చర్మం మీది మృతకణాలను తొలగించి మృదువుగా చేస్తుంది.

No comment allowed please