#PullaaReddySweets : మ‌ధురం రుచి అద్భుతం పుల్లారెడ్డి స్వీట్లు

Pullaa Reddy Sweets  : తాతలు, తల్లిదండ్రులు, వారి పిల్లలు ఇలా ప్రతి తరం జి.పుల్లారెడ్డి స్వీట్స్ ను రుచి చూసిన వారే. ఇంతటి ప్రాచుర్యం పొందిన మిఠాయిలు ఈ దేశంలో ఎక్కడా లేదంటే అతిశయోక్తి కాదేమో. ఒకే ఒక్క సామాన్యమైన వ్యక్తి అసమాన్యమైన ..అసాధారణమైన..నభూతో న భవిష్యత్ అన్న రీతిలో సాధించిన అపురూపమైన గెలుపు గాథ ఇది. నాణ్యత, నమ్మకం, సేవ ఇవే పుల్లారెడ్డి (Pullaa Reddy Sweets ) సక్సెస్ కు మూల కారణం. దాదాపు 71 సంవత్సరాలు అంటే ఏడు దశాబ్దాలు గడిచి పోయాయి.

కానీ తరాలు మారినా రుచిలో, శుచిలో, నాణ్యతలో ఎక్కడా రాజీ పడకుండా అప్రహతిహతంగా సాగి పోతూనే ఉన్నది. ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా పేరున్న కర్నూల్ జిల్లాకు చెందిన జి. పుల్లారెడ్డి అనే వ్యక్తి మదిలో మెదిలిన ఈ ఆలోచనే, నేడు మాహా వృక్షమై వేలాది మందికి నీడనిస్తోంది. కోట్లాది మందికి మిఠాయిల రుచిని పంచుతోంది.

ఒకప్పుడు సైకిల్ మీద పాల కోవాను తయారు చేసుకుని, ఇల్లిల్లు తిరుగుతూ రోడ్ల మీద అమ్ముకుంటూ ప్రారంభమైన పుల్లారెడ్డి దుకాణం ఇప్పుడు అతి పెద్ద పరిశ్రమగా రూపాంతరం చెందింది. అంతే కాకుండా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలకు ఆసరాగా ఉంటోంది. మిఠాయిలతో పాటు ప్రతి రోజు ప్రతి కుటుంబం నిత్యం వాడుకునే పచ్చళ్ళు, నిల్వ ఉండే అప్పడాలు, మురుకులు , ఇలా ప్రతిదీ పుల్లారెడ్డి షాప్స్(Pullaa Reddy Sweets )లలో లభిస్తున్నాయి.

దేశంలోని ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు, రాష్ట్రపతులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, వ్యాపారులు, అత్యున్నతమైన స్థానాలలో ఉన్న వాళ్ళు..ఇలా సామాన్యుల నుంచి పెద్దల దాకా , పిల్లల నుంచి వృద్ధుల దాకా అంతా పుల్లారెడ్డి మిఠాయీల ప్రేమికులే. అందరికీ అందుబాటు ధరల్లో తయారు చేయడం వీరి ప్రత్యేకత. తారక రామారావు, మొరార్జీ దేశాయి, లాల్ బహదూర్ శాస్త్రి , నీలం సంజీవ రెడ్డి, వీవీ గిరి , కలాం , లాంటి మహానుభావులు పుల్లారెడ్డి స్వీట్స్ తిన్న వారే.

జీడీ పప్పు పాకం, పూత రేకులు, సోన్ పట్టి , కలాకండ్, కాజు బర్ఫీ, జాహంగీర్ , జిలేబి తో పాటు నిమ్మకాయ, మామిడికాయ, పొడులు కూడా ఇప్పుడు అమ్ముతున్నారు. ఇరు రాష్ట్రాలతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలలో పుల్లారెడ్డి స్వీట్స్ (Pullaa Reddy Sweets )దుకాణాలు ఉన్నాయి. హైదరాబాద్ లో ఏ ఫంక్షన్ జరిగినా ముందుగా తీసుకునేది ..ప్రిఫర్ చేసేది ఈ స్వీట్స్ నే . శంషాబాద్ ఎయిర్ పోర్ట్ దగ్గర కూడా షాప్ ఓపెన్ చేశారు. ఒకప్పుడు చిన్నగా స్టార్ట్ అయిన ఈ స్వీట్స్ వ్యాపారం ఇప్పుడు కోట్లాది రూపాయల ఆదాయాన్ని గడించే స్థాయికి చేరుకుంది.

ఏ పని అయినా, లేదా ఏ వ్యాపారమైనా సక్సెస్ కావాలంటే కావాల్సింది నమ్మకం, నాణ్యత, సర్వీస్ ఇవే. వీటిని తూచా తప్పకుండా పాటిస్తే డబ్బులు వాటంతటా అవే వాలి పోతాయి. తరాలు గడిచినా , పాలకులు మారినా, మార్కెట్ రంగం కుదుపునకు లోనైనా ..జి.పుల్లారెడ్డ్డి స్వీట్స్ లలో మార్పులు మాత్రం రాలేదు. ఇదే విజయం వెనుక ఉన్న రహస్యం . పుల్లారెడ్డి మన మధ్య లేరు. కానీ మనం కోరుకునే ..రుచికరమైన మిఠాయీలల్లో ఉన్నారు. పలకరిస్తూనే ఉంటారు. వీలు కుదిరితే మీరూ ఒక్కసారి పుల్లారెడ్డి స్వీట్ షాప్స్(Pullaa Reddy Sweets )ను సందర్శించండి . ఆ అమృత భాండాగారాన్ని ఆస్వాదించండి.

No comment allowed please