Dasoju Sravan : రైల్వే మంత్రి రాజీనామా చేయాలి – దాసోజు
కేంద్రం నిర్వాకం వల్లనే రైలు ప్రమాదం
Dasoju Sravan : భారత రాష్ట్ర సమితి అగ్ర నాయకుడు దాసోజు శ్రవణ్(Dasoju Sravan) కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒడిశా రైలు ప్రమాదంలో చని పోయిన వారికి తీవ్ర సంతాపం తెలిపారు. ఇదే సమయంలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ పై మండిపడ్డారు. ఈ ప్రమాదానికి కేంద్ర మంత్రిత్వ శాఖ బాధ్యత వహించాలని పేర్కొన్నారు. ఇవాళ దాసోజు శ్రవణ్ మీడియాతో మాట్లాడారు.
రైలు ప్రమాదానికి బాధ్యత వహిస్తూ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో చిన్న ఘటన జరిగిన వెంటనే తన పదవి నుంచి తప్పుకున్న చరిత్ర భారత దేశ రాజకీయాలలో ఉందన్నారు. యాంటీ డివైస్ ను ఏర్పాటు చేసి ఉన్నట్లయితే ఈ ఘోరమైన రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదని ఆరోపించారు.
ఇది పూర్తిగా మానవ తప్పిదమేనని , సాంకేతిక లోపం ఎంత మాత్రం కాదని స్పష్టం చేశారు. వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవంపై ఉన్నంత శ్రద్ద రైల్వైల భద్రత, సమర్థతపై ఎందుకు ఫోకస్ పెట్టలేక పోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు డాక్టర్ దాసోజు శ్రవణ్. ఇది ఎంత మాత్రం క్షమించదగిన అంశం కాదన్నారు.
2011-12 లో రైల్వే శాఖ మాజీ మంత్రి ప్రస్తుత సీఎం మమతా బెనర్జీ హయాంలో ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్ ను రూపొందించినట్లు చెప్పారు. అయితే మోడీ ప్రభుత్వం కొలువు తీరాక దీనిని కవాచ్ గా పేరు మార్చిందని ఆరోపించారు. దీనిని అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని మండిపడ్డారు దాసోజు శ్రవణ్.
Also Read : Udhay Nidhi Stalin