Iqbal Kaskar : ఈడీ కస్టడీకి దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్
మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు
Iqbal Kaskar : మనీ లాండింగ్ కేసుకు సంబంధించి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం సోదరుడు ఇక్బాల్ కస్కర్(Iqbal Kaskar) ను జైలు నుంచి కస్టడీకి తీసుకుంది ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ – ఈడీ.
ఇదిలా ఉండగా ఇక్బాల్ కస్కర్ ను ముంబై లోని మనీ లాండరింగ్ నిరోధక చట్టం – పీఎంఎల్ఏ ప్రత్యేక కోర్టులో హాజరు పర్చనున్నారు.
డాన్ , అతని సహాయకులపై నమోదైన మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న గ్యాంగ్ స్టర్ దావూద్ సోదరుడు ఇక్బాల్ కస్కర్(Iqbal Kaskar) ను ఈడీ ఇవాళ థానే జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంది.
ఈ కేసుకు సంబంధించి ఈనెల 16న కోర్టు కస్కర్ పై ప్రొడక్షన్ వారెంట్ జారీ చేసింది. పలు దోపిడీ కేసుల్లో కస్కర్ ప్రస్తుతం థానే జైలులో ఉన్నాడు.
ప్రత్యేక న్యాయమూర్తి ఎంజీ దేశ్ పాండే నిందితులను ఎస్కార్ట్ చేసి 18న కోర్టు ముందు హాజరు పరిచేందుకు ఈడీ అన్ని ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు.
సంబంధిత నేరాలకు సంబంధించి కూడా దర్యాప్తు సంస్థ కస్కర్ ను మళ్లీ హాజరయ్యేలా చూడాలని ఈడీని ఆదేశించింది.
అండర్ వరల్డ్ కార్యకలాపాలు, అక్రమ ఆస్తుల ఒప్పందాలు, హవాలా లావాదేవీలపై మనీ లాండరింగ్ విచారణలో భాగంగా ముంబైలో పలుసార్లు సోదాలు చేపట్టింది ఈడీ.
ఒక రోజు అనంతరం కస్కర్ ను విచారించేందుకు సన్నద్దమైంది. ఈ మేరకు కస్కర్ ను థానే జైలు నుంచి కస్టడీలోకి తీసుకుంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంతో సంబంధం ఉన్న 10 చోట్ల సోదాలు చేపట్టారు.
వీరిలో దావూద్ దివంగత సోదరి హసీనా పార్కర్ , కస్కర్ , ముంబై లోని గ్యాంగ్ స్టర్ ఛోటా షకీల్ బావ కూడా ఉన్నారు.
Also Read : అరవింద్ కేజ్రీవాల్ పై చన్నీ కన్నెర్ర