Deepika Padukone : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె నటించిన గెహరాయ్రాన్ మూవీలో నటించిది. ఇది ఈనెల 11న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. మిశ్రమ స్పందన లభించింది.
అయితే ఇందులో దీపిక పదుకొనే(Deepika Padukone) ఊహించని రీతిలో రొమాన్స్ పండించింది. బోల్డ్ సినిమా కంటే దారుణంగా నటించిందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
తనకు మూవీ నచ్చిందని, పాత్ర పరంగా ఆ సన్నివేశాలలో నటించాల్సి వచ్చిందంటూ చెప్పింది దీపికా పదుకొనే. ఈ మూవీలో ప్రెగ్నెన్సీ కూడా ఓ భాగం కావడంతో మీడియా ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అంటూ అడగడంతో ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చింది.
ఇప్పట్లో పిల్లలు కనాలని తమకు లేదని చెప్పింది. దీపికా పదుకొనే ప్రముఖ నటుడు 2018లో రణ్ వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది. దాదాపు నాలుగేళ్లు కావస్తోంది. పిల్లలు లేక పోతే ఎలా. పోనీ ఆ ఆలోచన లేదా అని అడగడంతో జోవియల్ గా చెప్పింది.
ఇది వ్యక్తిగత విషయానికి సంబంధించి. ప్రస్తుతం తను నేను కెరీర్ పైనే ఎక్కువగా ఫోకస్ పెట్టామని పేర్కొంది. కొందరు తనను టార్గెట్ చేస్తూ ఇది పోర్న్ సినిమా అని, ఇంకొందరు స్కిన్ షో చేసిందంటూ చేసిన విమర్శల్ని కొట్టి పారేసింది దీపికా పదుకొనే(Deepika Padukone).
మొత్తంగా గెహరాయ్రాన్ మూవీ దేశాన్ని ఒక ఊపు ఊపేస్తోంది . కుర్రకారు ఇందులో ఏదో ఉందంటూ చూడడం మొదలు పెట్టారు.
కథ పరంగా నటించానే తప్పా తాను స్కిన్ షో ఏ మాత్రం చేయలేదంటోంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం దీపికా పదుకొనే డార్లింగ్ ప్రభాస్ తో మూవీ చేస్తోంది.
Also Read : దుమ్ము రేపుతున్న ‘అరబిక్ కుతు’