Deepthi Ravula : ‘వి’ హ‌బ్ నిర్మాణంలో దీప్తి కీల‌కం

మ‌హిళా ఔత్సాహికుల‌కు ఆలంబ‌న

Deepthi Ravula : తెలంగాణ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత కీల‌క‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. ప్ర‌ధానంగా టెక్నాల‌జీ ప‌రంగా మ‌రింత మ‌ద్ద‌తు క‌ల్పించేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు సీఎం కేసీఆర్. యంగ్ అండ్ డైన‌మిక్ లీడ‌ర్ షిప్ ల‌క్ష‌ణాలు క‌లిగిన ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ ఉండ‌డంతో సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్టారు. ఇందులో భాగంగా టి హ‌బ్ ను మొద‌ట ఏర్పాటు చేశారు.

అనంత‌రం దానికి పెద్ద ఎత్తున స్పంద‌న రావ‌డంతో కేవ‌లం మ‌హిళ‌ల కోసం వి హ‌బ్ కు శ్రీ‌కారం చుట్టారు. వేలాది మంది మ‌హిళ‌ల‌కు టెక్నాల‌జీ ప‌రంగా స‌హ‌కారం అందుతోంది. అంతే కాదు ఔత్సాహికులకు , వ్యాపార వేత్త‌లుగా మారేందుకు ప్ర‌య‌త్నం చేస్తోంది. ఇందుకు సంబంధించి ఫండింగ్ స‌పోర్ట్ కూడా అందుతోంది.

ఇక వి హ‌బ్ కు కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తున్నారు దీప్తి రావుల‌(Deepthi Ravula). దేశంలోనే మ‌హిళ‌ల కోసం ఏర్పాటైన సంస్థ ఇది. కేవ‌లం హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయ‌డం విశేషం. ఇంక్యుబేష‌న్ హ‌బ్ గా దీనిని మార్చారు. ఆమె చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ గా ఉన్నారు. తెలంగాణ స‌ర్కార్ విజ‌న్ ను సాకారం చేసే య‌జ్ఞంలో భాగ‌మ‌య్యారు.

రాష్ట్రం ఏర్ప‌డ‌క ముందు దీప్తి రావుల ఎన్నో కార్య‌క్ర‌మాల‌లో భాగం పంచుకున్నారు. అమెరికాలో కొన్నేళ్ల పాటు నివ‌సించారు. అక్క‌డే ఉన్నా త‌న హృద‌యం హైద‌రాబాద్ తో ముడిప‌డి ఉంద‌ని ఈ సంద‌ర్భంగా దీప్తి రావుల(Deepthi Ravula) పేర్కొన్నారు. ప్ర‌భుత్వం అందించిన అవ‌కాశాన్ని కాద‌న‌లేక పోయారు. ఇప్పుడు వీ హ‌బ్ కు తానే అన్నీ అయి న‌డిపిస్తున్నారు. స‌ర్కార్ క‌ల‌ల‌కు రెక్క‌లు తొడిగే ప‌నిలో ఉన్నారు.

Also Read : సివిక్ స్టూడియోస్ మాస్ వాయిస్

1 Comment
  1. Ravula udayteja says

    Namasta madam

Leave A Reply

Your Email Id will not be published!