Mallikarjun Kharge : ఎన్నికల్లో అపజయం అందరం బాధ్యులం
కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే
Mallikarjun Kharge : దేశ వ్యాప్తంగా జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని రీతిలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్ , గోవా, మణిపూర్ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మరోసారి తన సత్తా చాటింది.
అయితే అధికారంలో ఉన్న పంజాబ్ రాష్ట్రాన్ని కోల్పోయింది. అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీఈ కోలుకోలేని రీతిలో దెబ్బ కొట్టింది. 117 సీట్లకు గాను 92 సీట్లలో చీపురు జెండా ఎగుర వేసింది.
సాక్షాత్తూ ఏఐసీసీ తాత్కాలిక చీఫ్ తనయురాలు ప్రియాంక గాంధీ అన్నీ తానై యూపీలో ప్రచారం చేసినా పార్టీ ఉన్న సీట్లు కోల్పోయి చతికిల పడింది. అక్కడ 2 సీట్లు మాత్రమే దక్కించుకుని ఉన్న పరువు పోగొట్టుకుంది.
ఇక ఆప్ గణనీయంగా ఓటు బ్యాంకు కలిగి ఉండడం కాంగ్రెస్ పార్టీని కోలుకోనీయకుండా చేసింది. ఇక పంజాబ్ లో ఆ పార్టీలో నెలకొన్న ఆధిపత్య పోరు, లుకలుకలే కొంప ముంచాయి.
ఈ తరుణంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లతో పాటు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు వెల్లువెత్తాయి. ఓటమికి బాధ్యత వహిస్తూ గాంధీ కుటుంబం తప్పు కోవాలని, రాజీనామా చేయాలని డిమాండ్ పెరిగింది.
ఈ తరుణంలోనే సీడబ్ల్యూసీ కీలక సమావేశం జరిగింది. దీనిపై స్పందించిన కాంగ్రెస్ రాజ్యసభా పక్ష నేత మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge )కీలక వ్యాఖ్యలు చేశారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గాంధీ కుటుంబం బాధ్యత కాదని తామందరం బాధ్యులేమనంటూ పేర్కొన్నారు. ఆయన గాంధీ ఫ్యామిలీని వెనకేసుకు వచ్చారు.
Also Read : చిత్రా రామకృష్ణ కస్టడీ పొడిగింపు