Delhi MCD Election : ఢిల్లీ బల్దియా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్
డిసెంబర్ 4న ఎన్నికలు 7న ఫలితాలు
Delhi MCD Election : ఎట్టకేలకు ఢిల్లీ మున్సిపల్ (బల్దియా) ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్(Delhi MCD Election) విడుదల చేశారు. ఈ ఎన్నికలు వచ్చే నెల డిసెంబర్ 4న ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 7న రిజల్ట్స్ ప్రకటించనున్నారు. దీంతో కేంద్రంలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ దేశ రాజధానిలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మధ్య ప్రతిష్టాత్మకమైన పోరు కొనసాగనుంది.
ఇప్పటికే కేంద్రం వర్సెస్ ఢిల్లీ మధ్య యుద్దం నడుస్తోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి పూర్తి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం. ఒకే రోజు ఎన్నికలు చేపడతారు. ఈ ఎన్నికలకు సంబంధించి నవంబర్ 7 నుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. నవంబర్ 14 వరకు నామినేషన్లు దాఖలు చేసేందుకు డెడ్ లైన్ విధించింది.
నవంబర్ 16న నామినేషన్లు పరిశీలిస్తారు. 19 వరకు తమ నామినేషన్లు ఉప సంహరించు కోవచ్చు. ఇప్పటి వరకు వార్డుల పునర్విభజన చేపట్టారు. మొత్తంగా చూస్తే ఢిల్లీ పరిధిలో 250 వార్డులుగా నిర్ణయించారు. పునర్విభజన చేసిన వార్డులలో 42 వార్డులు ఎస్టీలకు కేటాయించారు. 21 సీట్లు మహిళలకు ఇవ్వనున్నారు.
కొంత కాలం పాటు ఎన్నికలు జరగకుండా వాయిదా పడుతూ వచ్చాయి. కోర్టును ఆశ్రయించాయి కేంద్రం, ఆప్. మూడు మున్సిపాలిటీలను ఢిల్లీలో కలపాలని కేంద్రం యత్నించింది. దీనిపై అభ్యంతరం తెలిపింది ఆప్ ప్రభుత్వం. దేశ రాజధానిలో మొత్తం కోటి 48 లక్షల మంది ఓటర్లు ఉన్నారు.
ప్రస్తుతం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్య నువ్వా నేనా అన్న రీతిలో ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ తరుణంలో బీజేపీ సత్తా చాటుతుందా ఆప్ తన ప్రభావాన్ని చాటుతుందా అన్నది తేలుతుంది.
Also Read : భారత దేశపు మొదటి ఓటరు ‘నేగి’ మృతి