Delhi Man Arrested : నిధుల మళ్లింపులో ఢిల్లీ వ్యాపారి అరెస్ట్
సెర్చింగ్ ఆపరేషన్ లో ఢిల్లీ వ్యక్తి కీలకం
Delhi Man Arrested : జమ్మూ కాశ్మీర్ లో వేర్పాటువాదులు, ఉగ్రవాదులు, భారత్ కు వ్యతిరేకంగా పని చేస్తున్న ఉగ్రవాద సంస్థలకు నిధులు సమకూర్చిన రాకెట్ ను ఛేధించారు.
ఢిల్లీకి చెందిన యాసిన్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ(Delhi Man Arrested) పోలీసులు. కేవలం ఉగ్రవాద చర్యల కోసం కాశ్మీర్ కు పెద్ద ఎత్తున హవాలా రూపంలో నిధులు తరలించడంలో గత కొంత కాలంగా కీలక పాత్ర పోషిస్తూ వచ్చాడని గుర్తించారు.
ఈ మేరకు ఢిల్లీ పోలసులు అరెస్ట్ చేయడంతో కీలక ఆధారాలు లభ్యమైనట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాసిన్ తనకు విదేశాల్లో ఉన్న పరిచాయల నుంచి నిధులు రాబట్టారు.
వాటిని పెద్ద మొత్తంలో జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర చర్యలకు ప్లాన్ చేస్తున్న ఉగ్ర మూకలతో టచ్ లో ఉంటూ ఉగ్రవాద సంస్థలకు మళ్లిస్తూ వచ్చాడు నిధులను. ఈ మొత్తం నిధులను హవాలా మార్గంలో చేపట్టాడని వెల్లడించారు.
జమ్మూ కాశ్మీర్ పోలీసులు గత కొంత కాలంగా సంయుక్త ఆపరేషన్ చేపట్టారని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ కు చెందిన స్పెషల్ కమిషనర్ ఆఫ్ పోలీస్ హెచ్ జీ ఎస్ ధాలివాల్ స్పష్టం చేశారు.
యాసిన్ ఉగ్రవాద సంస్థలుగా పేరొందిన లష్కరే తోయిబా , అల్ బదర్ లకు డబ్బులను మళ్లించాడని చెప్పారు. నిందితుడు మహ్మద్ యాసిన్ ఢిల్లీలోని తుర్కమన్ గేట్ ప్రాంతంలో ఉంటూ వస్త్ర వ్యాపారం చేస్తున్నాడు.
గత వారం కాశ్మీర్ లోని అబ్దుల్ హమీద్ మీర్ అనే ఉగ్రవాద కార్యకర్తకు రూ. 10 లక్షలు పంపాడన్నారు. అతడిని అరెస్ట్ చేయడంతో మరిన్ని వివరాలు లభించాయి. అతడి నుంచి రూ 7 లక్షల నగదుతో పాటు మొబైల్ ను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు.
Also Read : బీజేపీ అడ్డుకున్నా ఆప్ ప్రజా పాలన ఆగదు