Meenakshi Lekhi : ఢిల్లీకి పార్ట్ టైమ్ సీఎం అక్కర్లేదు – మీనాక్షి
అరవింద్ కేజ్రీవాల్ పై సంచలన కామెంట్స్
Meenakshi Lekhi : కేంద్ర మంత్రి మీనాక్షి లేఖి నిప్పులు చెరిగారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడారు. ప్రజలు పాలన సాగిస్తారని ఓటు వేసి గెలిపిస్తే సీఎం కేజ్రీవాల్ రాజకీయాలు చేస్తూ విలువైన కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ మండిపడ్డారు. ఒక రకంగా ఢిల్లీ సీఎంను పార్ట్ టైం సీఎంగా అభివర్ణించారు.
ఇలాంటి వారిని ఎందుకు ఎన్నుకున్నామా అని ఢిల్లీ ప్రజలు వాపోతున్నారని పేర్కొన్నారు. మాయ మాటలు చెబుతూ ప్రజలను మభ్య పెట్టడంలో కేజ్రీవాల్ ఆరి తేరారని ఎద్దేవా చేశారు మీనాక్షి లేఖి(Meenakshi Lekhi).
పార్ట్ టైం సీఎంగా ఉన్న కేజ్రీవాల్ రాజకీయ టూర్లతో బిజీగా ఉండాల్సిన అవసరం లేదన్నారు. గత ఏడు సంవత్సరాల కాంలో పర్యావరణ కింద వసూలు చేసిన సెస్ ద్వారా రూ. 1,286 కోట్లు జమ అయ్యాయని తెలిపారు.
కానీ ఆప్ సర్కార్ కాలుష్య నివారణ కోసం కేవలం రూ. 272 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని ఆరోపించారు మీనాక్షి లేఖి. ఇక్కడే ఆయనకు ప్రజల పట్ల, ప్రభుత్వం పట్ల ఉన్న చిత్తశుద్ది ఏపాటిదో అర్థం అవుతుందన్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పూర్తిగా గాలికి ఒదిలి వేశారంటూ ధ్వజమెత్తారు కేంద్ర మంత్రి. ఓ వైపు లిక్కర్ స్కాం, ఇంకో వైపు సమస్యల నుంచి ప్రజలను దృష్టి మరల్చేందుకే ఇతర రాష్ట్రాలలో ప్రచారం పేరుతో దాక్కుంటున్నాడని ఆరోపించారు మీనాక్షి లేఖి(Meenakshi Lekhi).
ఆమె చేసిన ఆరోపణలపై ఆప్ సర్కార్ కానీ ఆ పార్టీకి చెందిన నేతలు ఎవరూ స్పందించ లేదు. ఆమె చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. త్వరలో బల్దియా ఎన్నికలు జరుగుతున్నాయి ఢిల్లీలో.
Also Read : సంజయ్ రౌత్ కు బెయిల్ మంజూరు