Delhi High Court : దేశ వ్యాప్తంగా ఢిల్లీ (Delhi) సీఎం అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను లక్ష్యంగా ఆయన నివాసంపై బీజేపీ (BJP) ఆధ్వర్యంలో దాడి జరగడం చర్చకు దారి తీసింది. దీనిపై నిష్పక్షపాతంగా విచారణ జరిపేందుకు సిట్ ఏర్పాటు చేయాలని ఆప్ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ పిటిషన్ దాఖలు చేసింది.
దీనిపై విచారించిన ఢిల్లీ కోర్టు (Delhi High Court)తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం నివాసంలో జరిగిన విధ్వంసంపై స్టేటస్ రిపోర్టు వెంటనే సమర్పించాలంటూ ఢిల్లీ పోలీసులను ఆదేశించింది కోర్టు.
తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టివ్ విపిన్ సంఘీ, జస్టిస్ నవీన్ చావ్లాతో కూడిన ధర్మాసనం(Delhi High Court) విచారించింది. ఘటనకు సంబంధించిన వీడియోను పరిశీలించిన తర్వాత సీఎం నివాసం వెలుపల భద్రత సరిపోదని, మూకలు బెదిరించడాన్ని గుర్తించింది కోర్టు.
ఇది పూర్తిగా గర్హణీయం కాదని, తాము వీడియోను చూశామని, కొంత మంది గేటు ఎక్కేందుకు ప్రయత్నించారని, వారు విజయవంతం కాలేదని పేర్కొంది ధర్మాసనం.
గుంపులో ఉన్న వారిలో కొందరు శాంతి భద్రతలను తమ చేతుల్లోకి తీసుకున్నారు. పోలీసు బలం బహుశా సరి పోలేదు. మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయ పడింది.
మీరు కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ రకమైన సంఘటన జరగడం గురించి మీరు ఎలాంటి సమాచారం, ఎలాంటి బెదిరింపు అవగాహన కలిగి ఉన్నారో కూడా వివరించాలని ఆదేశించింది ధర్మాసనం.
పోలీసుల తరపున అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ హాజరయ్యారు. ఈ ఘటనపై సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి ఫిర్యాదు రాలేదని కోర్టుకు తెలిపారు.
Also Read : మహారాష్ట్ర సర్కార్ కు సుప్రీం షాక్