Satyendar Jain Arrest : ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి అరెస్ట్
అదుపులోకి తీసుకున్న ఈడీ
Satyendar Jain Arrest : కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్(Satyendar Jain Arrest) ను అరెస్ట్ చేసింది. ఆప్ సర్కార్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో అదుపులోకి తీసుకుంది.
అరవింద్ కేజ్రీవాల్ కేబినెట్ లో మంత్రిగా ఉన్న సత్యేంద్ర జైన్ 2015-16లో కోల్ కతాకు చెందిన సంస్థతో హవాలా లావాదేవీలకు పాల్పడ్డారని ఈడీ ఆరోపించింది.
హవాలా వ్యవస్థలో రెండు పార్టీలు తమ తరపున స్థానిక ఏజెంట్లతో డబ్బు లావాదేవీలు జరపడంతో పాటు అధికారిక బ్యాంకింగ్ మార్గాల ద్వారా నిధులు వెళ్లాయని అభియోగం మోపింది.
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) మంత్రి సత్యేంద్ర జైన్ , ఆయన కుటుంబంపై రూ. 1.62 కోట్ల వరకు మనీ లాండరింగ్ పాల్పడినట్లు ఆరోపణలు చేసింది.
ఈ మేరకు ఆగస్టు 2017లో కేసు నమోదు చేసింది. 2011-12లో రూ. 11. 78 కోట్లు, 2015-16లో రూ. 4.63 కోట్లు లాండరింగ్ చేసేందుకు జైన్(Satyendar Jain Arrest), ఆయన ఫ్యామిలీ అసలు వ్యాపారం లేని కంపెనీలను, నాలుగు షెల్ కంపెనీలు స్థాపించారంటూ సీబీఐ ఆరోపించింది.
ఇదిలా ఉండగా సీబీఐ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లేదా ఎఫ్ఐఆర్ ఆధారంగా మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ తన విచారణను ప్రారంభించింది.
కాగా మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రస్తుతం దేశంలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఆప్ సీఎం అరవింద్ కేజ్రీవాల్, తెలంగాణ సీఎం కేసీఆర్ లను టార్గెట్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.
అయితే సత్యేంద్ర జైన్(Satyendar Jain Arrest) హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ఇన్ చార్జిగా ఉన్నారు ఆప్ కు. ఎలక్షన్స్ ను దృష్టిలో పెట్టుకుని అరెస్ట్ చేశారంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఆరోపించారు.
Also Read : ఢిల్లీలో గాలి వాన బీభత్సం