Delhi High Court : సీబీఐకి ఢిల్లీ హైకోర్టు నోటీసు

గౌత‌మ్ ఖైతాన్ బెయిల్ పిటిష‌న్ పై

Delhi High Court : బ్రెజిల్ కు చెందిన విమానాల త‌యారీ సంస్థ కిక్ బ్యాక్ చెల్లించింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై ఇటీవ‌ల అరెస్ట్ అయ్యారు ఢిల్లీకి చెందిన న్యాయ‌వాది గౌత‌మ్ ఖైతాన్.

ఈ మేర‌కు త‌నకు బెయిల్ పిటిష‌న్ ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టును ఆశ్ర‌యించాడు. ఇందుకు సంబంధించిన పిటిష‌న్ పై సెంట్ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ (సీబీఐ)కి కోర్టు నోటీసులు(Delhi High Court) జారీ చేసింది.

కాగా ఖైతాన్ బెయిల్ పిటిష‌న్ ను ట్ర‌య‌ల్ కోర్టు సెప్టెంబ‌ర్ 3న కొట్టి వేసింది. జ‌స్టిస్ జ‌స్మీత్ సింగ్ ధ‌ర్మాస‌నం శుక్ర‌వారం సీబీఐ నుండి ప్ర‌తిస్పంద‌న‌ను కోరింది. ఒక వారం లోపు స్థితి నివేదిక‌ను ఇవ్వాల‌ని ఆదేశించింది.

ఈ అంశాన్ని కేసు కు సంబంధించి ఈనెల 16న తిరిగి విచారించ‌నున్న‌ట్లు ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది. గౌత‌మ్ ఖైతాన్ త‌ర‌పున హాజ‌రైన సీనియ‌ర్ న్యాయ‌వాది వాదించారు.

ఇది ఆరేళ్ల కింద‌టి నాటి ఎఫ్ఐఆర్ అని. త‌న క్ల‌యింట్ చాలాసార్లు విచార‌ణ‌కు హాజ‌రైన‌ట్లు తెలిపారు. సీబీఐకి పూర్తిగా స‌హ‌క‌రించార‌ని వెల్ల‌డించారు. ఇదిలా ఉండ‌గా ఈ కేసులో ప్ర‌ధాన నిందితులు, ఉద్యోగులు ఎవ‌ర‌నేది ఇంకా తెలియ రాలేదు.

అక్టోబ‌ర్ 18, 2016 నాటి ఎఫ్ఐఆర్ లో బెయిల్ కోసం నిందితుడు గౌత‌మ్ ఖైతాన్ త‌ర‌పున అభ్య‌ర్థ‌న‌ను స‌మ‌ర్పించారు. ర‌క్ష‌ణ మంత్రిత్వ శాఖ‌లోని తెలియ‌ని అధికారుల‌పై అవినీతి నిరోధ‌క చ‌ట్టం 1988 పీసీ యాక్టు సంబంధిత సెక్ష‌న్ల కింద సీబీఐ కేసు న‌మోదు చేసింది.

Also Read : షాను ఎగ‌తాళి చేస్తూ టీఎంసీ టీ ష‌ర్ట్

Leave A Reply

Your Email Id will not be published!